23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

సామాజిక భద్రతా కార్యక్రమాలు…. తెలంగాణ బలహీన వర్గాలకు ఓ వరం!

హైదరాబాద్: రాష్ట్రంలోని బలహీన వర్గాలు గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం సామాజిక భద్రతా కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. ఆసరా పెన్షన్లను ప్రవేశపెట్టింది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ద్వారా అవసరమైన ఆహారం మరియు ఆహారేతర వస్తువుల పంపిణీని చేపట్టింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) యొక్క గణాంకాల ప్రకారం… మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పనిలేనివారికి ఉపాధి అవకాశాలను కల్పించింది. సామాజిక భద్రతలో భాగంగా పేదల కోసం అనేక పెన్షన్‌ పథకాలు తీసుకొచ్చారు. రాష్ట్రంలోని పెన్షన్ పథకాలలో ప్రధానంగా
సీనియర్ సిటిజన్లు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, హెచ్‌ఐవి రోగులు, ఫైలేరియా రోగులకు పెన్షన్లు, అలాగే బీడీ కార్మికులకు ఆర్థిక సహాయం ఉన్నాయి. రాష్ట్రంలో వివిధ పింఛన్ల కింద ఉన్న మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2019-20లో 38.59 లక్షల నుండి 2020-21 నాటికి 38.80 లక్షలకు పెరిగింది. 2020-21 సంవత్సరంలో 1,22,80,948 మంది వ్యక్తులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద నమోద చేసుకున్నారు., వారిలో 52,98,588 మంది 2020-21 నాటికి పని చేస్తున్నారు. మొత్తం పని చేసే లబ్ధిదారుల్లో 55.6 శాతం మంది మహిళలు, 44.4 శాతం మంది పురుషులు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో భాగంగా స్వయం సహాయక బృందాలు (SHGలు) ను ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 47,57,468 మంది పేద గ్రామీణ మహిళలు 4,39,886 గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ స్వయం సహాయక గ్రూపుల ద్వారా తెలంగాణలో 2020-21 నాటికి 17,013 గ్రామీణ మాల్స్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మహిళా సాధికారతకు అవకాశం ఏర్పడింది. ఇప్పటికే 22 దుకాణాలను ప్రారంభమయ్యాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles