31 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఫీజు నియంత్రణపై ముసాయిదా చట్టాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి…. ప్రభుత్వాన్ని కోరుతున్న తల్లిదండ్రులు!.

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీల ఫీజు నియంత్రణ కమిటీ తరహాలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులను నియంత్రించేందుకు చట్టం తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక మంత్రి టి హరీష్ రావు, శాసనమండలి మంత్రి కార్యవర్గ సభ్యులు వి ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఇ దయాకర్ రావు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కెటి రామారావు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి విధివిధానాలపై సిఫార్సులు సమర్పించాలని రాష్ట్రంలోని వివిధ వర్గాలను కోరారు. రాష్ట్ర విద్యా శాఖ అధికారుల సమాచారం ప్రకారం… ఫీజు నియంత్రణ అంశంపై ఇప్పటివరకు తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల సంస్థలు కూడా ఈ కమిటీకి మెమోరాండంలు సమర్పించాయి. ఈ సందర్భంగా ఎన్ శ్రీకాంత్ అనే ఓ పేరెంట్ మీడియాతో మాట్లాడుతూ…. ఫీజు నియంత్రణ చట్టంపై డ్రాఫ్ట్ ప్రతిపాదనలను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు ఉంచరు?” అని అడిగారు. గత రెండేళ్లుగా పాఠశాలల ఆగడాలతో తల్లిదండ్రులు నరకయాతన అనుభవించారని ఆయన తెలిపారు. కొన్నింటిని మినహాయిస్తే, పలు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫిర్యాదు చేయడానికి ఎవరూ లేరు. ఒకవేళ ఎలాగోలా సాహసించి ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదు. పాఠశాలలు వాటి పనిలో అవి నిమగ్నమవుతున్నాయి.” పాఠశాలల ద్వారా జరిగే దోపిడీని నిరోధించడానికి చట్టంలో సరియైన ఏర్పాటు ఉండాలని ఆయన సూచించారు.
కొన్ని పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాల పాఠ్యాంశాలను అనుసరిస్తున్నామని పేర్కొంటారు. వారు అనుభవపూర్వక అభ్యాసం, ప్రయోగాత్మక అభ్యాసం,  మెటాకాగ్నిటివ్ లెర్నింగ్, ఫోకస్డ్ కాగ్నిటివ్ ప్రాసెస్‌లను అందించడం, విద్యార్థులు సైన్స్ నేర్చుకునేలా చేయడం వంటి సాంకేతిక పదాలను ఉపయోగిస్తారు, ”అని ఐటి ప్రొఫెషనల్ కెఎస్ మూర్తి తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక హై-ఎండ్ కార్పోరేట్ స్కూల్‌లో తన కూతురికి ప్రతి సంవత్సరం రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నారు, ఓసారి ఆ పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రుల ఓరియంటేషన్ సెషన్‌కు పిలిచారు. అక్కడ నాకు తెలిసొచ్చిందేమిటంటే… ఆ స్కూల్‌లో ఒకరిద్దరు టీచర్లు మినహా, తమ పాఠశాలలో చేరిన పిల్లలకు సరిపోయేలా ఎలా భోదించాలో మిగతా ఉపాధ్యాయులకు తెలియదు”. నా పిల్లలు సరైన మార్గంలో నేర్చుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి ఇంట్లో నేను వారితో అదనపు సమయాన్ని వెచ్చిస్తాను అని అతను వాపోయాడు. తమ పిల్లలు ఏదైనా గొప్పగా నేర్చుకోబోతున్నారని భావించేలా తల్లిదండ్రులను ఆకర్షించడానికి ఆయా పాఠశాలలు పెద్దపెద్ద సాంకేతిక పదాలను రూపొందించడం ఒక మార్గంగా ఎంచుకున్నారు. మరి కొన్నిస్కూళ్లు అవుట్‌సోర్స్‌ పద్ధతిలో అంతర్జాతీయ సంస్థల సాయం తీసుకుంటున్నామని ఒట్టి ప్రచారం చేసుకోవడమే తప్ప ఆచరణలో ఫలితం ఉండడం లేదు. ఇక స్కూళ్లలో గుర్రపు స్వారీ, స్విమ్మింగ్ (పాఠశాల ఆవరణలో స్విమ్మింగ్ పూల్ లేనప్పటికీ) వివిధ రకాల శిక్షణలు ఇస్తామని, 7వ తరగతి నుంచి విద్యార్థులను ఐఐటీకి సన్నద్ధం చేస్తామని నమ్మబలుకుతుంటాయి. “ఈ నేపథ్యంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ-2020 విషయంలో చేసినట్లే… రాష్ట్ర ప్రభుత్వం తన ముసాయిదా రుసుము నియంత్రణ బిల్లులను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి. ప్రజల నుండి సలహాలను కోరడం వివేకం. అని హిమాయత్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో గణితశాస్త్ర సీనియర్ ఉపాధ్యాయురాలు సంగీతా దేవి అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles