33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కొవిడ్‌ రోగులకు బంధువు… గాంధీ ఆస్పత్రి! 85వేలమందికి సేవలు – ఆసియాలోనే మొదటిది!

హైదరాబాద్: గత రెండేళ్లుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాంధీ ఆసుపత్రి కోవిడ్ రోగులకు చికిత్స అందించే నోడల్ కేంద్రంగా ఉంది. ఇక్కడి వైద్యులు ఈ రెండేళ్లలో 85,000 మందికి పైగా రోగులకు చికిత్స అందించారు. కోవిడ్‌ యోధులుగా నిలిచిన వైద్యులు, సిబ్బందిని అభినందించేందుకు బుధవారం ఆస్పత్రిలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అధికారులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), సూపరింటెండెంట్, సీనియర్ వైద్యులు కోవిడ్‌పై పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసినందుకు ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు మాట్లాడుతూ..
“కొవిడ్‌ మహమ్మారి సమయంలో, తమ కుటుంబ సభ్యులు మరణించినప్పటికీ వైద్యులు పని చేయాల్సి వచ్చింది; వేసవిలో పిపిఇ ధరించడం ఎంతో ఇబ్బందికరమైనా, విపరీతంగా చెమటలు కక్కుతున్నావారు పీపీఇలు ధరించి తమ కర్తవ్యాన్ని నెరవేర్చారు.” వైరస్ సోకుతుందనే భయంతో పాటు ఎక్కువ గంటలు పిపిఇలు ధరించి పనిచేసిన మహిళా వైద్యులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అన్నారు. “అయితే, ఆ సమయంలో ఆసుపత్రిలో చాలా మంది రోగులు చనిపోయారు. కానీ అవన్నీ కోవిడ్ మరణాలు కాదు. ఆసుపత్రి సిబ్బందిలో కూడా ముగ్గురు మరణించారు. దాదాపు 2,200 అంతర్గత ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి” అని డాక్టర్ రావు తెలిపారు. మార్చి 2, 2019న, కొవిడ్‌ వైరస్ సోకిన మొదటి వ్యక్తిని చేర్చుకున్నాం. చికిత్స తరువాత నెగటివ్‌ అనంతరం అతన్ని డిశ్చార్జి కూడా చేశాం. ఆ మొదలు ఇప్పటికిదాకా కోవిడ్ బారిన పడ‌్డ 85,000 మందికి పైగా వ్యక్తులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిఎంఇ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ… “ఇంత పెద్ద సంఖ్యలో కోవిడ్ రోగులకు చికిత్స అందించి, విజయవంతంగా శస్త్రచికిత్సలు చేసిన ఏకైక ఆసుపత్రి… మొత్తం ఆసియా ఖండంలోనే గాంధీ ఆసుపత్రి కావడం ఒక విశేషం అని ఆయన అన్నారు. కొవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో 500కి పైగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ బెడ్‌లను అమర్చారు. ఆక్సిజన్ లభ్యతను కూడా బాగా పెంచారు. ఇంతకుముందు, 26 KL సామర్థ్యం కలిగిన ఒకే ఒక్క లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (LMO) ట్యాంక్ మాత్రమే ఉంది, ఇది ఇప్పుడు ఒక్కొక్కటి 2 నుండి 6 KL వరకు సామర్థ్యాలతో ఆరు అదనపు ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (PSA) సౌకర్యాల ద్వారా పెంచారు. ఆసుపత్రి వైద్యులు, నర్సులు మరియు పేషెంట్ కేర్ సిబ్బందితో సహా దాదాపు 300 మంది ఉద్యోగులను కూడా నియమించుకుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles