23.7 C
Hyderabad
Monday, September 30, 2024

పేదల ఆత్మగౌరవ ప్రతీక డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు… మంత్రి కేటీఆర్‌! ఓల్డ్‌ మారేడ్‌ పల్లిలో 468 గృహాలు ప్రారంభం!

హైదరాబాద్‌: ఓల్డ్‌మారేడుపల్లిలో 5.18 ఎకరాల విస్తీర్ణంలో రూ.36.27 కోట్ల వ్యయంతో 22 బ్లాక్‌లలో అధునాతనంగా నిర్మించిన 468 డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని గురువారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందజేశారు. మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తూ..రాష్ట్రంలో 18 వేల కోట్ల వ్యయంతో 2.72 లక్షల గృహాలు అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని, ఇందులో గ్రేటర్‌ పరిధిలో లక్ష ఇళ్లు అద్భుతంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్లు దేశంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు నిర్మించలేదని, డిగ్నిటీ కాలనీలతో నిరుపేదల కుటుంబాలు కూడా ఆత్మగౌరవంతో జీవిస్తున్నాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ పెద్ద మనస్సుతో పేదల సొంతింటి కల నెరవేర్చాలని కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని వసతులతో లబ్ధిదారులపై పైసా భారం పడకుండా ఇళ్లు కట్టించి ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు అంటున్నారని గుర్తుచేశారు. ఇల్లు కట్టిస్తా..బిడ్డ పెండ్లి కూడా నేనే చేస్తా..అన్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్‌ ఒక్కరేనని స్పష్టం చేశారు.  ఇచ్చిన ఇండ్లను అమ్మడం లేదా కొనడం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, కార్మిక, హోంశాఖ మంత్రులు మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, బల్దియా కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ తదితరులు పాల్గొన్నారు.
ఇలాంటి ఇండ్లు మరెకడా లేవు: మంత్రి తలసాని
రూ.350 కోట్ల విలువైన స్థలంలో నిర్మించిన ఒక్కో డబుల్‌బెడ్‌ రూం ఇల్లు రూ.కోటికి తకువగా ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఈ కాలనీవాసులకు నల్లాబిల్లు ఉండదని, కంటోన్మెంట్‌ కేంద్ర పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇకడ నివసించే వారికి అవసరమైన పనులు చేస్తున్నారని, కంటోన్మెంట్‌లో కూడా ఇంటింటికి 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా అందిస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లబ్ధిదారులపై ఒక రూపాయి భారం పడకుండా చక్కటి ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని, దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లు లేవన్నారు. వరద నివారణ కోసం రూ.10 కోట్లతో హస్మత్‌పేట నాలాను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.
గేటెడ్‌ కమ్యూనిటీలకు తీసిపోనట్లు..
కంటోన్మెంట్‌ నియోజకవర్గం పాత మారేడ్‌పల్లిలో నిర్మించిన రెండుపడక గదుల ఇండ్లు గేటెడ్‌ కమ్యూనిటీలను తీసిపోని విధంగా నిర్మించారు. చక్కటి గార్డెనింగ్‌, పార్కు, పార్కింగ్‌ వసతి, వచ్చిపోయే మార్గం..ప్రతీది ప్రత్యేకంగా నిర్మించడంతో కొత్తగా వచ్చిన వారు..పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన కాలనీయేనా..అని ఆశ్చర్యపోక తప్పదు.
నేడు తుకారాం గేట్‌ ఆర్‌యూబీ ప్రారంభం
ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ. 29.10 కోట్ల వ్యయంతో చేపట్టిన తుకారాం రైల్వే అండర్‌ బ్రిడ్జిని శుక్రవారం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ మహానగరం నలువైపులా విస్తరిస్తున్న నగరీకరణ వల్ల పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. వ్యూహాత్మక రోడ్‌ డెవలప్‌మెంట్‌ పథకం ద్వారా చేపట్టిన తుకారం రైల్వే అండర్‌ బ్రిడ్జి శుక్రవారం అందుబాటులోకి రానున్నది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles