23.7 C
Hyderabad
Monday, September 30, 2024

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్‌: హరీశ్‌రావు!

బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. (రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్)

@ తెలంగాణ అసెంబ్లీ బుధ‌వారానికి వాయిదా!

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు బుధ‌వారానికి(మార్చి 9) వాయిదా ప‌డ్డాయి. ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని రెండు గంట‌ల పాటు చ‌దివి వినిపించారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు హ‌రీశ్‌రావు త‌న ప్ర‌సంగాన్ని ముగించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.

2 గంట‌ల పాటు కొన‌సాగిన మంత్రి హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగం

రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని 2 గంట‌ల పాటు చ‌దివి వినిపించారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు హ‌రీశ్‌రావు త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

@ రీజనల్‌ రింగ్‌ రోడ్‌కు రూ.500 కోట్లు.
@ సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.400 కోట్లు.
@ గిరిజన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.600 కోట్లు.
@ ఎస్టీ సంక్షేమానికి రూ.12,565 కోట్లు.
@ బీసీ సంక్షేమానికి రూ.5698 కోట్లు.
@ వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు హరితహారానికి రూ. 932 కోట్లు
మోటార్లకు మీటర్లు పెట్టబోం. విద్యుత్‌ సంస్కరణలకు ఒప్పుకోం. ఒక్క ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క పథకానికి డబ్బులు ఇవ్వలేదు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన డబ్బును సెస్‌ రూపంలో దోచుకుంటోంది. 27శాతం ఆదాయం కూడా రావట్లేదు.
@ సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా పింఛన్లు. ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు.
@ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.2,750 కోట్లు
@ బ్రాహ్మణ సంక్షేమానికి రూ,177 కోట్లు.
@ రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యువల్ నిర్వహణ గ్రాంట్ రూ.1,542 కోట్లు.
@ పోలీసు శాఖకు రూ.9,315 కోట్లు..
@ యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి..
@ రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు – క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు
@ దళిత బంధుకు రూ.17,700 కోట్లు
@ పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
@ పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు
@ కొత్త వైద్య కళాశాలలకు రూ. వెయ్యి కోట్లు..
@ అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
@ మెదక్, మేడ్చల్, రంగారెడ్డి ములుగు, నారాయణపేట, గద్వాల, యాదాద్రిలో వైద్య కళాశాలలు
@ కేంద్రం రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు అడిగినా కేంద్రం                ఇవ్వలేదు.
@ రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
@ వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ..
@ రాష్ట్రంలో పన్ను ఆదాయం 1,08,211.93 కోట్లు కేంద్ర పనుల్లో వాటా 18,394.11 కోట్లు. పన్నేతర ఆదాయం                25.421.63 కోట్లు,  గ్రాంట్లు 41,001.73 కోట్లు రుణాలు 53,970 కోట్లు.
@ 2022-23 నాటికి మొత్తం అప్పులు 3,29,998 కోట్లు. జీఎస్టీపీలో 25 శాతం.
@ పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ..
@ 7 రాష్ట్రంలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహం. పామాయిల్ సాగుకు రూ. వెయ్యి కోట్లు. రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో             ఆయిల్ పామ్ సాగు లక్ష్యం.
@ సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం..
@ అమ్మకం పన్ను అంచనా 33,000 కోట్లు.
@ ఎక్సైజ్ ద్వారా ఆదాయం 17,500 కోట్లు.
@ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం 15,600 కోట్లు

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ సభలో ప్రవేశపెట్టారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే దేశంలో కెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్ర స్వప్పం సాకారమైంది’ అని హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్...

బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగులుతున్నారని భాజపా ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ లను ప్రస్తుత సెషన్ పూర్తి అయ్యేవరకు సస్పెండ్ చేసిన తెలంగాణ అసెంబ్లీ…

హైదరాబాద్‌: ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా… ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేలా బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో కేసీఆర్​ మార్కు కనిపిస్తుందన్నారు. రైతులకు, పేద ప్రజలకు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుందన్నారు. సభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి… బడ్జెట్‌ ప్రతులు అందించారు. కాసేపట్లో అసెంబ్లీలో పద్దును మంత్రి హరీశ్​ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో రైతులు, సామాన్యులకు పెద్దపీట వేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్‌ ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశాం. ఈ బడ్జెట్​లో కేసీఆర్ మార్క్ కనిపిస్తుందని ఆర్థికమంత్రి హరీష్‌రావు చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles