24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

340 కిలోమీట‌ర్ల మేర రీజిన‌ల్ రింగ్ రోడ్డు నిర్మాణం.. దేశంలోనే అతి పొడ‌వైన బైపాస్.. హరీశ్ రావు!

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుకి 40 కిలోమీటర్ల అవతల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది.  రాజధాని నగరం చుట్టూ 340 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) పనులు జరుగుతున్నాయని, నగరంలోని ఉత్తర ప్రాంతంలో ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో తెలిపారు.
“హైదరాబాద్ నగరం చాలా వేగంగా విస్తరిస్తున్నందున, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) ఉండాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాకుండా, ఆర్‌ఆర్‌ఆర్ జిల్లాల నుండి హైదరాబాద్‌కు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది, ”అని ఆయన చెప్పారు, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుండి 30 కి.మీ దాటి 340 కి.మీ పొడవుతో నిర్మించబడుతుందని ఆయన అన్నారు.  ఈ రీజిన‌ల్ రింగ్ రోడ్డు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూసేకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.
కేంద్ర రోడ్డు ర‌వాణా మంత్రిత్వ శాఖ హైద‌రాబాద్ చుట్టూ రీజిన‌ల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌)ను నిర్మించేందుకు సూచ‌న ప్రాయంగా అంగీకారం తెలిపింది. 340 కిలోమీట‌ర్ల మేర ఈ రోడ్డును నిర్మించ‌నున్నారు. తెలంగాణ‌లో ఉన్న అన్ని జిల్లాల‌ను ఈ రోడ్డు హైద‌రాబాద్‌తో క‌లుపుతుంది. ఈ రోడ్డును నిర్మించేందుకు మొత్తం రూ.16వేల కోట్ల వ్య‌యం కానుంది. ఈ రోడ్డు నిర్మాణం అయితే దేశంలోనే అత్యంత పొడ‌వైన బైపాస్‌గా మారుతుంది.
2016 న‌వంబ‌ర్ నెల‌లో రీజిన‌ల్ రింగ్ రోడ్డును రెండు భాగాలుగా నిర్మించేందుకు జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే ఈ రోడ్డును ద‌క్షిణ‌, ఉత్త‌ర భాగాలుగా విభ‌జించి నిర్మించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా తీసుకున్న నిర్ణ‌యం రోడ్డు నిర్మాణానికి మార్గాన్ని సుగ‌మం చేసింది.
రీజిన‌ల్ రింగ్ రోడ్డును ఉత్త‌ర భాగంలో 158 కిలోమీటర్ల మేర పూర్తి చేస్తారు. సంగారెడ్డి, న‌ర్సాపూర్‌, తూప్రాన్‌, గ‌జ్వేల్‌, యాదాద్రి, ప్ర‌జ్ఞాపూర్‌, భువ‌న‌గిరి, చౌటుప్ప‌ల్‌ల మీదుగా ఈ రోడ్డు కొన‌సాగుతుంది. ఈ రోడ్డుకు రూ.7,560 కోట్ల వ్య‌యం అవుతుంది. ఆ మొత్తాన్ని కేంద్రం భరిస్తుంది. అలాగే భూ సేక‌ర‌ణ‌కు అయ్యే రూ.1961 కోట్ల‌ను కూడా కేంద్రమే భ‌రిస్తుంది. ఇక ఆ మొత్తం వ్య‌యంలో రాష్ట్రం 50 శాతం వాటాను భ‌రిస్తుంది.
ద‌క్షిణ భాగంలో 182 కిలోమీట‌ర్ల మేర‌ రీజిన‌ల్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు మంత్రి గ‌డ్క‌రీ నుంచి ఆమోదం ల‌భించింద‌ని మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా చౌటుప్ప‌ల్‌, ఇబ్ర‌హీంప‌ట్నం, కందుకూరు, ఆమ‌న‌గ‌ల్లు, చేవెళ్ల‌, శంక‌ర్‌ప‌ల్లి, సంగారెడ్డిల మీదుగా రోడ్డు నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. ఇందుకు రూ.4322 కోట్లు ఖ‌ర్చవుతుంద‌ని, భూసేక‌ర‌ణ‌కు మ‌రో రూ.1748 కోట్లు అవుతాయ‌ని తెలిపారు.
రీజిన‌ల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వ‌స్తే ముంబై, పూణె, నాగ్‌పూర్‌, బెంగ‌ళూరు, ఢిల్లీ న‌గ‌రాల‌కు ట్రాఫిక్‌ను డైవ‌ర్ట్ చేయ‌వ‌చ్చు. దీంతో హైద‌రాబాద్, సైబ‌రాబాద్ ల‌లో ట్రాఫిక్ ర‌ద్దీతోపాటు కాలుష్య‌మూ త‌గ్గుతుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles