23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం!

హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో ముందడుగు పడింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. శాసనసభలో సీఎం ప్రకటన మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1, హోంశాఖ, జైళ్లు, రవాణా, వైద్య, ఆరోగ్య శాఖల్లో భర్తీకి అనుమతి ఇచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు అంగీకరించిన ఆర్థికశాఖ.. ఇందుకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సంబంధిత నియామకసంస్థలు భర్తీ ప్రక్రియ చేపట్టనున్నాయి.

ఉద్యోగాల భర్తీకి సంబంధించి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటనకు అనుగుణంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, అధికారులు ఇందుకు సంబంధించిన కసరత్తును పూర్తి చేశారు. ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశమై తదుపరి ప్రక్రియపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు గాను ఇవాళ తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో 30,453 పోస్టుల భర్తీ ఎలా?

  • టీఎస్‌పీఎస్సీ ద్వారా 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి అనుమతి
  • పోలీస్‌ నియామక సంస్థ ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టుల భర్తీకి అనుమతి
  • పోలీస్‌ నియామక సంస్థ ద్వారా పోలీస్‌శాఖలో 16,587 పోస్టుల భర్తీ
  • టీఎస్‌పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూ.అసిస్టెంట్ పోస్టుల భర్తీ
  • టీఎస్‌పీఎస్సీ ద్వారా వైద్యారోగ్య శాఖలో 2,662 పోస్టుల భర్తీ
  • డిప్యూటీ కలెక్టర్-42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121 పోస్టులు భర్తీ
  • వైద్యారోగ్యశాఖ పాలనాధికారి-20, వాణిజ్యపన్నుల శాఖలో 48 పోస్టులు భర్తీ
  • అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40 పోస్టులు భర్తీ
  • ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ  10028 పోస్టులు భర్తీ

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles