23.7 C
Hyderabad
Monday, September 30, 2024

లైబ్రరీలు, స్టడీ సెంటర్ల కోసం పాతబస్తీ యువత గగ్గోలు!!

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మెగా జాబ్‌ మేళా ప్రకటించిన తర్వాత, నగరంలోని లైబ్రరీలకు వెళ్లే యువకులు రికార్డు స్థాయిలో పెరిగారు. అయితే పాతబస్తీలో లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో యువత ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ముఖ్యంగా మైనార్టీ శాఖ ఈ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందజేస్తే పాతబస్తీలోని మైనారిటీ యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మైనారిటీల అధిక జనాభా నగరం యొక్క దక్షిణ భాగంలో నివసిస్తుంది. కనుక పోటీ పరీక్షల కోసం యువతకు శిక్షణ ఇవ్వడానికి తాత్కాలిక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తే అది వారి భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశముంది.

ఇక పాతబస్తీ టీఎస్‌ఎంఎఫ్‌సీ (TSMFC) పరిధిలోని లైబ్రరీలతో పాటు కోచింగ్‌ సెంటర్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. అవసరమైన మెటీరియల్‌ కూడా దొరకడం లేదు. “టీఎస్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలో 40కి పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని స్టడీ మెటీరియల్ కమ్ లైబ్రరీని కూడా కలిగి ఉన్నాయి, కానీ ఇప్పుడు అవేవి నగరంలో పనిచేయడం లేదు, ఎందుకంటే గత రెండేళ్లుగా TSMFC వాటిని పట్టించుకోలేదు. మైనారిటీ యువత మంచి భవిష్యత్తు కోసం ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో స్టడీ మెటీరియల్ అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖపై ఉంది’’ అని సామాజిక కార్యకర్త ఆసిఫ్ హుస్సేన్ అన్నారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కోచింగ్ ప్రారంభించగా, పాతబస్తీలో మైనార్టీలకు ఇంకా కోచింగ్ సెంటర్లు లేవు. మైనార్టీలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందేందుకు ఇది గొప్ప అవకాశం కాబట్టి, మైనారిటీ సంక్షేమ శాఖ చొరవ తీసుకుని స్టడీ మెటీరియల్స్, పోటీ పరీక్షలకు కోచింగ్ తరగతులను తక్షణమే ప్రారంభించాలి. కాగా, ప్రభుత్వ శాఖల ఉద్యోగాల అర్హత పరీక్షలకు త్వరలో తరగతులు ప్రారంభిస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు. మైనారిటీ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ ఇప్పటికే సాధారణ ఫౌండేషన్ కోర్సును నిర్వహిస్తోంది, ఇక్కడ జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్ అఫైర్స్, ఏదైనా ఉద్యోగాన్వేషణ పరీక్షలో ఇతర సాధారణ సబ్జెక్టులు బోధిస్తున్నారు. స్టడీ సర్కిల్ ద్వారా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారు. విద్యార్ధుల ప్రయోజనం కోసం యూట్యూబ్‌లో కంటెంట్ కూడా అప్‌లోడ్ చేయబడుతోంది, ”అని షాన్‌వాజ్‌ ఖాసిం అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles