33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మల్కం చెరువు మళ్లీ జీవం పోసుకుంది… అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్!

హైదరాబాద్: గ్రేటర్‌లోని చెరువుల్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ హామీలు ఒక్కొక్కటిగా అమలుకు నోచుకుంటున్నాయి. కాంక్రీట్ జంగిల్‌లో, కాలుష్య వాతావరణంలో విసిగి వేసారుతున్న నగర ప్రజలకు హాయినిచ్చే ఆహ్లాద కేంద్రాలుగా, పిక్నిక్‌స్పాట్‌లుగా వీటిని మారుస్తున్నారు. అందుబాటులోని స్థలాన్ని బట్టి అన్ని చెరువులనూ యూనిఫామ్‌గా నడక మార్గాలు, బెంచీలు, కెఫ్టేరియా, టాయ్‌లెట్లు, పార్కింగ్ వంటి సకల సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా మల్కంపేట చెరువు కొత్త అందాలను సంతరించుకుంది.

సర్వాంగ సుందరంగా మల్కం చెరువు

శేరిలింగంపల్లి మండపల పరిధిలోని రాయదుర్గం మల్కం చెరువు 51.30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఓల్డ్‌ బాంబే హైవే వెంబడి ఉండటంతో ఈ చెరువును మినీ ట్యాంకు బండ్‌లా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అపర్ణ ఇన్‌ఫ్రా హౌజింగ్‌ ప్రై.లి. సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులు వెచ్చించి చెరువును సుందరీకరించేందుకు ముందుకు వచ్చింది. చెరువులో పూడిక తీత పనులు చేపట్టారు. ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌ మార్గాలను అభివృద్ధి చేశారు. చెరువు చుట్టూ గ్రిల్స్‌ వేసి ఉంచారు. ల్యాండ్‌ స్కేప్‌, చిల్డ్రన్‌ ప్లే ఏరియా, ఓపెన్‌ జిమ్‌, అంఫీ థియేటర్‌, సైక్లింగ్‌, జాగింగ్‌ ట్రాక్‌, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి తదితర వసతులను కల్పించారు. మినీ పర్యాటక క్షేత్రంగా మల్కం చెరువును తీర్చిదిద్దారు. దాదాపు రూ.30 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేశారు.

అంతకుముందు, ఈ చెరువు మురుగునీటితో కలుషితమైంది. పునరుద్ధరణ తర్వాత చెరువులోకి ప్రవేశించే మురుగునీటి లైన్లు మళ్లించారు. చెరువు పునరుజ్జీవన ప్రాజెక్ట్ కింద, నీటి వనరులను రక్షించడానికి చర్యలు తీసుకున్నారు. ఇనుప గ్రిల్‌తో శాశ్వతంగా చెరువు చుట్టూ సరిహద్దు ఫెన్సింగ్, వాటర్ హైసింత్, ఇతర తేలియాడే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు చెరువు నుండి తొలగించడం వంటి పనులు చేపట్టారు.చెరువు చెక్కుచెదరకుండా ఉండటానికి ఇన్‌లెట్‌లు/అవుట్‌లెట్‌లను మెరుగుపరచడంతోపాటు , నిమజ్జనం కోసం చెరువు విడిగా సిల్టింగ్ ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం, సైక్లింగ్‌ కోసం ప్రత్యేక రోడ్డు‌, పాదచారుల (జాగింగ్ మరియు వాకింగ్) 1.8 కి.మీ మార్గాలతో సహా అనేక సౌకర్యాలు అభివృద్ధి చేయబడ్డాయి. పిల్లల కోసం, పరిపక్వ ట్రీ లైన్ సరిహద్దుల మార్పిడితో ఇంటిగ్రేటెడ్ ప్లే స్పేస్‌లు ఏర్పడ్డాయి. జిరోఫైట్ గార్డెన్ వంటి అనేక చిన్న తోటలు సరస్సు అంతటా అభివృద్ధి చేయబడ్డాయి. ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడానికి, సరస్సు వద్ద ఓపెన్ జిమ్‌తో సహా ఫిజికల్ ఫిట్‌నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను ఆకర్షించడానికి, వంతెనలు, జెట్టీ ప్రాంతం,  రాక్ బౌల్డర్ కన్జర్వేషన్ జోన్‌లో ఒక బౌల్డర్ పార్క్, వంతెనపై అడుగుతో సహా ప్రత్యేక పక్షుల ద్వీపంతో నిర్మించబడ్డాయి.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles