24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఐప్యాక్‌తో టీఆర్‌ఎస్‌ ఒప్పందం!

హైదరాబాద్‌: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐ ప్యాక్‌) సేవలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) కాంగ్రెస్‌ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనా కూడా.. ఐప్యాక్‌ సేవలను టీఆర్‌ఎస్‌ వినియోగించుకోబోతోంది. ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే పలు సూచనలు, ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన టీఆర్ఎస్.. ఐప్యాక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆదివారం ఇక్కడ మీడియాతో అనధికారిక ఇంటరాక్షన్‌లో, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీకి ముందు టిఆర్‌ఎస్ నిర్ణయాన్ని వెల్లడించారు.  ఈ ఒప్పందం ప్రశాంత్‌ కిషోర్‌ స్థాపించిన ఐప్యాక్‌తో మాత్రమేనని, ప్రశాంత్‌ కిషోర్‌తో కాదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ఒప్పందం కొనసాగుతుందని ఆదివారం ఆయన వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కోసం ఐప్యాక్‌ పనిచేస్తుందని వివరించారు.

కేటీఆర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గత రెండు దశాబ్దాలుగా టీఆర్‌ఎస్‌ను నడుపుతున్నారని, ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్రం ఏర్పడిన సమయంలో పిల్లలు ఇప్పుడు రాష్ట్రంలో ఓటర్లుగా ఉన్నారని రామారావు వివరించారు. “రాష్ట్రం కోసం కేసీఆర్ లేదా టీఆర్‌ఎస్ ఏమి చేశారో ముందు తరాలు గుర్తుంచుకుంటున్నప్పటికీ, ఉద్యమ సమయంలో చాలా చిన్న వయస్సులో ఉన్న ఈ తరం ఓటర్లను అదే అర్థం చేసుకోవడానికి పార్టీ మిస్ అవ్వాలనుకోదు. వారిని చేరుకోవడానికి డిజిటల్ మాధ్యమం కూడా చాలా ముఖ్యమైనదిగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఐపాక్‌ సాయం చేయనుంది’ అని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్‌– పీకే.. సుదీర్ఘంగా భేటీ: ప్రశాంత్‌ కిశోర్‌ శనివారం ఉదయం 9.30 గం. ప్రగతిభవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వారు రోజంతా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించారు రెండో రోజు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు సీఎం కేసీఆర్‌తో పీకే సమావేశమయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భాజపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కావాలనే లక్ష్యంతో ఆ పార్టీని ఎంచుకున్నానని పీకే పేర్కొన్నట్లు తెలిసింది. తాను కాంగ్రెస్‌లో చేరినా తమ సంస్థ ఐప్యాక్‌ తెరాసకు రాజకీయ సలహా సేవలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా తెరాస, ఇతర పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై నిర్వహించిన సర్వే ఫలితాలను వివరించినట్లు తెలుస్తోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles