28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్‌లో గూగుల్ భారీ క్యాంపస్‌… ఇది అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్దది!

హైదరాబాద్: పెట్టుబడులకు, వ్యాపార కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్ కేరాఫ్‌గా మారుతోంది. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పలు దిగ్గజ టెక్ సంస్థలు కొలువుదీరిన నగరంలో ‘గూగుల్’ సంస్థ రూపంలో మరో భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్‌ను ఆ సంస్థ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్మించనుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గురువారం (ఏప్రిల్ 28) ఈ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

నానాక్‌రాంగూడలోని 7.3 ఎకరాల్లో 30లక్షల 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ పర్మినెంట్ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం గురువారం జరిగింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ దీనికి శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే గూగుల్‌ ఏర్పాటు చేస్తున్న రెండో అతిపెద్ద కార్యాలయం ఇదే కావడం విశేషంగా చెప్పుకోవాలి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఇప్పటికే అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ వంటి అగ్రగామి సంస్థలతో పాటు గూగుల్‌ కూడా తన పర్మినెంట్ ఆఫీస్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు రావడం గర్వకారణమన్నారు మంత్రి కేటీఆర్.

గూగుల్‌ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. డిజిటల్‌ తెలంగాణ ఆలోచనకు మద్దతు ఇవ్వడంతోపాటు డిజిటల్‌ రంగంలో పౌరులు సాధికారత సాధించాలనే పరస్పర లక్ష్యాన్ని సాధించడానికి గూగుల్‌ తోడ్పాటు అందిస్తున్నదని పేర్కొన్నారు. వరల్డ్‌లోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగిన గూగుల్‌ భారత్‌లో గూగుల్‌ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకుంది. ఇకపై కూడా తమ కార్యకలాపాలను తెలంగాణలో మరింత విస్తరింజేస్తామని గూగుల్‌ ఇండియా కంట్రీ హెడ్‌, ఉపాధ్యక్షుడు సంజయ్‌ గుప్తా తెలిపారు.

తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, గూగుల్‌ భారత విభాగ ఉపాధ్యక్షుడు సంజయ్‌ గుప్తా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణలోని ప్రతి పౌరుడూ డిజిటల్‌ సాధికారత సాధించేలా శిక్షణ ఇవ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమని కేటీఆర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ‘డిజిటల్‌ తెలంగాణ’ దార్శనికతకు ఈ ప్రాజెక్టు వాస్తవరూపం తెచ్చేందుకు సహకరిస్తుందన్నారు. ఈ సందర్భంగా గూగుల్‌ భారత విభాగ ఉపాధ్యక్షుడు సంజయ్‌గుప్తా మాట్లాడుతూ… హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించడంతో తెలంగాణతో తమ అనుబంధం మరింత దృఢపడిందన్నారు. ప్రపంచంలో అత్యధిక మంది ఐటీ ఉద్యోగులు పనిచేసే కేంద్రాల్లో ఇది కూడా ఒకటిగా మారుతుందని తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles