31 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా మసీవుల్లాఖాన్…. బాధ్యతల స్వీకరణ!

హైదరాబాద్‌: తెలంగాణ వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా మసీవుల్లాఖాన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఐదేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. నాంపల్లిలోని హజ్‌ హౌస్‌లో వక్ఫ్‌ బోర్డు సభ్యులందరితో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. హైటెక్ సిటీ, ఖాజాగూడ, నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన ఆస్తులు, భూములను తిరిగి పొందడం కొత్త ఛైర్మన్‌ లక్ష్యం కానుంది.
ఆక్రమణలు తొలగించాలని వక్ఫ్ కార్యకర్తలు బోర్డును చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. చైర్మన్‌గా ఖాన్ నియామకంపై వక్ఫ్ బోర్డు సీఈవో షానవాజ్ ఖాసిం మాట్లాడుతూ.. 10 మంది బోర్డు సభ్యుల్లో ఎనిమిది మంది ఎన్నికలకు హాజరయ్యారు. హజ్ హౌస్‌లో ఎన్నిక జరిగింది. బోర్డు ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మేజిస్ట్రేట్ ఎల్ శర్మను ఎన్నికల అధికారిగా నియమించింది.

బోర్డు సభ్యులుగా ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం జకీర్ హుస్సేన్ జావిద్, సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ హుస్సేనీ, అబ్దుల్ ఫతే సయ్యద్ బందగీ ​​బడేషా క్వాద్రీ ఎన్నికయ్యారు. మహ్మద్ మసీయుల్లా ఖాన్, సయ్యద్ నిసార్ హుస్సేన్ (షియా పండితుడు, హైదర్ అఘా), మాలిక్ మొహతాషిమ్ ఖాన్, షేక్ యాస్మిన్ బాషా (ప్రభుత్వ నామినీ) వివిధ వర్గాలకు చెందిన నలుగురు సభ్యులు బోర్డు సభ్యులుగా నామినేట్ అయ్యారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles