23.7 C
Hyderabad
Monday, September 30, 2024

‘మన బస్తీ-మన బడి’… హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం!

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమం కింద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక పాఠశాలలు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ విద్యావ్యవస్థను మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మన బస్తీ మన బడి పథకాన్ని ప్రవేశపెట్టారని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని విజయనగర్‌ నగర్‌ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. సోమవారం నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్‌ మెరాజ్‌తో కలిసి విజయనగర్‌ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలల అప్‌గ్రేడ్‌ పనులకు మహమూద్‌ అలీ శంకుస్థాపన చేశారు.
హోమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అప్‌గ్రేడేషన్‌తో ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఈ కార్యక్రమం కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు కూడా ఇతరులతో సమానంగా అవకాశాలు అందుకోవాలని, అందుకే ప్రభుత్వం ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా ప్రవేశపెడుతోందని మంత్రి అన్నారు. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవటానికి ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పాఠ్యపుస్తకాలు రూపొందించేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని మహమూద్ అలీ అన్నారు.
ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ మన బస్తీ-మన బడి కార్యక్రమం కింద ప్రాథమిక, ఉన్నత పాఠశాలల అప్‌గ్రేడేషన్‌కు సుమారు రూ.60 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. “ప్రాథమిక పాఠశాలకు రూ. 12 లక్షలు, ఉన్నత పాఠశాలకు రూ. 52 లక్షల చొప్పున ఖర్చు చేస్తారు. ఈ కార్యక్రమంలోని 12 రకాల పనులు చేపడతారని ఆయన తెలిపారు.
‘మన బస్తీ-మన బడి’తో ప్రభుత్వం పాఠశాలలకు డిజిటల్ విద్య అమలు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, పాఠశాలలకు మరమ్మతులు, పెయింటింగ్, గ్రీన్ చాక్‌బోర్డ్‌లు, ప్రహరీ గోడల నిర్మాణం వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించనున్నారు. కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం, హైస్కూళ్లలో డైనింగ్ హాళ్లు, నీటి సౌకర్యంతో టాయిలెట్లు సైతం నిర్మించనున్నారు.
చార్మినార్ నియోజకవర్గంలోని మరో రెండు పాఠశాలల పనులను కూడా ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రారంభించారు. మొగల్‌పురాలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో, శాలిబండలోని డానికా బాగ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. చార్మినార్‌లో ఉన్న ఒక్కో పాఠశాలకు మన బస్తీ-మన బడి పథకంలో అప్‌గ్రేడేషన్ కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఎమ్మెల్యే నిధుల కింద ఈ పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 కోట్లతో అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు, ప్రభుత్వ పాఠశాలల అప్‌గ్రేడ్‌కు రూ.3 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles