28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

వక్ఫ్ భూకేటాయింపులపై ఉద్యమకారుల హెచ్చరిక!

హైదరాబాద్/పహాడీ షరీఫ్‌: జల్‌పల్లి మున్సిపాలిటీలోని పహాడీషరీఫ్‌లో ఖరీదైన 16 ఎకరాల వక్ఫ్‌ భూమిని పండ్ల మార్కెట్‌ కోసం కేటాయించాలని ఫ్రూట్‌ మార్కెట్‌ హోల్‌సేల్‌ కమీషన్‌ ఏజెంట్ల ప్రతినిధి బృందం రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో హక్కుల కార్యకర్తలు వక్ఫ్‌ భూమిని కౌలుకు ఇవ్వొద్దని వక్ఫ్‌బోర్డును హెచ్చరించారు.

 బోర్డు ఆదాయాన్ని పెంచడానికి వక్ఫ్ భూమిని అద్దెకు ఇవ్వడంలో తప్పు లేదని అయితే, “వక్ఫ్ లక్ష్యాల పవిత్రతను సమర్థిస్తూ లావాదేవీలు న్యాయమైన పద్ధతిలో జరగాలని సామాజిక కార్యక్త సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేనీ అన్నారు. గతంలో చేసినట్లుగా వక్ఫ్‌ బోర్డు అద్దె కమిటీని ఏర్పాటు చేయాలి, అలా చేస్తే ఆస్తి యొక్క వాస్తవ భూమి విలువను నిర్ధారించడానికి, తదనుగుణంగా అద్దెను నిర్ణయించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.

దీని కోసం రోడ్లు మరియు భవనాల శాఖ (R&B), జీహెచ్‌ఎంసీ నుండి భూమి యొక్క సవరించిన ధరలను నిర్ధారించడానికి ఒక నివేదికను కోరాలి అని ఆ కార్యకర్త అన్నారు. ” 2015-16లో అప్పటి ప్రత్యేక అధికారి జలాలుద్దీన్‌ అక్బర్‌ ఆధ్వర్యంలో దర్గాల్లో హంగూల వేలం, ఇతర ఆస్తులను క్రమబద్ధీకరించేందుకు రెంటల్‌ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పహాడీ షరీఫ్‌లో పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు గుర్తించిన భూమి అద్దెలను సవరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.”

సలు వక్ఫ్ భూమిని ఏ సంఘానికీ అద్దెకు ఇచ్చే హక్కు వక్ఫ్‌ బోర్డుకి లేదని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా ఈ విధమైన ఒప్పందాలు జరగాలి, దీని ద్వారా నిర్ణీత విధానం ప్రకారం పండ్ల ఏజెంట్లకు భూములను వేలం వేయాలి. “నిర్దేశించిన నిబంధనల దేన్నైనా విస్మరిస్తే వక్ఫ్ లక్ష్యాల ఉల్లంఘనగా పరిగణించాలి. దాన్ని న్యాయస్థానంలో సవాలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రషెద్ ఖాన్ గట్టిగా వాదించారు.

ప్పటికే వక్ఫ్ బోర్డ్ అద్దెల త్రో అవే రేటుపై వాయిడ్‌-అబ్-ఇనిషియో ఒప్పందాల కారణంగా భారీ నష్టాన్ని చవిచూసింది. వక్ఫ్ లక్ష్యాలకు హాని కలిగించే అటువంటి పద్ధతిని కొనసాగించకూడదు. కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల అద్దెలను సవరించడం ద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచే చర్యలతో పాటు రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులు మరియు భూములకు రక్షణ కల్పించేలా వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

భూమిని విద్యాసంస్థలను స్థాపించడానికి ఇప్పటికే ఇతర వ్యక్తులకు కేటాయించారు, హఠాత్తుగా  దీనిని ఇప్పుడు పండ్ల మార్కెట్‌కు అద్దెకు ఇవ్వడం వక్ఫ్ లక్ష్యాలను ఉల్లంఘించడమే అవుతంది. పండ్ల ఏజెంట్లకు పునరావాసం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. వక్ఫ్ భూమిలో వారికి పునరావాసం కల్పించే బదులు ప్రభుత్వ భూమిని వారికి కేటాయించి న్యాయం చేయాలని ఆయన సూచించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles