31 C
Hyderabad
Tuesday, October 1, 2024

మోదీ విమర్శలు పసలేనివి…. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ!

బేగంపేట సభలో ప్రధాని మోదీ 
నిరంకుశ తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేరడం లేదు 
ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం దోపిడీకి గురవుతోంది 
కుటుంబ పార్టీలను తరిమేస్తేనేఅభివృద్ధి 
దేశాన్ని, విధానాలను మార్చే ప్రయత్నాలు సఫలం కానివ్వం 
మేం పారిపోయే వాళ్లం కాదు..పోరాడే వాళ్లం..

హైదరాబాద్: తెలంగాణకు ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ వాటిపై ప్రధాని మోదీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అదేసమయంలో నిన్న బేగంపేట వేదిక తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శలు పసలేనివిగా విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. గ్రామీణ ప్రగతిలో ఇటీవలే తెలంగాణ ఉత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులు కొల్లగొట్టింది. అంతేకాదు దేశ ఆర్థికవ్యవస్థకు నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా అత్యుత్తమ పనితీరు కనబరింది.

గురువారం బేగంపేట విమానాశ్రయ ప్రాంగణంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ తెలంగాణ అభివృద్ధికి కారణమైన పథకాలను ప్రస్తావించకుండా కేవలం రాజకీయ ప్రసంగం చేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వం పేరు మారుస్తోందని ఆరోపించే స్థాయికి కూడా వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని అనేక కేంద్ర కార్యక్రమాలను ప్రారంభించిన విషయాన్ని ప్రధాని తేలిగ్గా విస్మరించినట్లు కనిపిస్తోంది. మిషన్ భగీరథ విజయవంతమైన తర్వాత కేంద్రం “హర్ ఘర్ జల్” కార్యక్రమం ప్రారంభించింది. అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం తర్వాత పీఎం- కిసాన్ యోజన ప్రవేశపెట్టారు.

అధికార టీఆర్‌ఎస్‌పై ఎదురు దాడికి దిగిన ప్రధాని మోదీ, వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలికితేనే రాష్ట్రం, దేశాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ వైపు పవనాలు వీస్తున్నాయని నాకు తెలుస్తోంది. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ ఆశయాలకు బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్న ప్రధాని, తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ తీవ్ర స్థాయిలో పోరాడుతుందని చెప్పారు.

భారతదేశ ఆర్థికాభివృద్ధి శరవేగంగా పురోగమిస్తోందని, ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘కుటుంబ పాలన వల్ల తెలంగాణలో అభివృద్ధి వెనుకబాటుకు గురైంది. కటుంబపాలన కారణంగా యువత కలలు నెరవేరలేదు. తెలంగాణ మాత్రం ఒక కుటుంబం చేతుల్లో దోపిడీకి గురవుతోంది. వారిని అధికారం నుండి తొలగించినప్పుడు, అది అభివృద్ధికి దారులు తెరుస్తుంది, ”అని ఆయన నొక్కి చెప్పారు.

రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలి
సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆశయాల సాధనను సంకల్పంగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలి. తెలంగాణలో సంతుష్టీకరణ రాజకీయాలు సాగుతున్నాయి. దానికి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. తెలంగాణను పురోభివృద్ధి విషయంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles