31 C
Hyderabad
Tuesday, October 1, 2024

కేంద్రంపై దాడికి కేసీఆర్ పకడ్బందీ వ్యూహం… జూన్ 2న ముహూర్తం!

హైదరాబాద్: జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భారీ స్థాయిలో జరగనున్నాయి. ఈ వేడుకల్లో జాతీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కోవడానికి టిఆర్‌ఎస్ ఏం చేయబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పబ్లిక్ గార్డెన్స్‌లో ‘బలమైన రాజకీయ ప్రసంగం’ చేస్తారు.

బిజెపికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఫ్రంట్ విషయంలో ఆరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు ధోరణిపై టిఆర్ఎస్ అధినేత ప్రజలకు వివరించడం ఖాయం. తెలంగాణ రాష్ట్రం రుణాలు తిరిగి చెల్లిస్తున్నప్పటికీ కేంద్రం రుణాలపై ఎలా ఆంక్షలు విధించింది అనే అంశంపై కేసీఆర్ దృష్టి సారించే అవకాశం ఉంది. సంస్థాగత రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని, ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రానికి సెక్యూరిటీ బాండ్లను వేలం వేయకుండా ఆర్బీఐ నిలిపివేసిన తీరుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ వైఖరికి వ్యతిరేకంగా కేసీఆర్ జూన్‌2న మౌనం వీడవచ్చు.

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసే ప్రసంగం.. కేంద్రాన్ని నిలదేసే విధంగా అన్నిరకాల డేటాను సీఎం సేకరిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పనితీరును వివరించడంతోపాటు గత ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలు, బిజెపిని దెబ్బతీయడానికి సీఎం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఆ వర్గాలు తెలిపాయి.

రుణాలపై కేంద్రం విధించిన ఆంక్షల వల్ల రైతు బంధు, దళిత బంధు అమలులో తమ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందో ప్రజలకు వివరిస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆహ్వానించే అవకాశం లేదు. 8 ఏళ్లలో తెలంగాణ ఎలా మారిపోయిందనే దానిపై కేసీఆర్ సంక్షిప్త నోట్‌ను అందజేస్తారని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే భవిష్యత్తుపై తన విజన్‌ను వివరిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles