24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘మనూ’లో అడ్మిషన్ల గడువు పెంపు… జూన్ 12 వరకు అవకాశం!

హైదరాబాద్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) రెగ్యులర్ కోర్సులకు అడ్మిషన్‌ గడువును పొడిగించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు జూన్ 12 వరకు సమర్పించవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. అంతకుముందు మే 31న చివరితేది. దీన్ని ఇప్పుడు తాజాగా సవరించింది.

మనూ వర్సిటీలో హిస్టరీ, ఆర్కియాలజీ, కల్చర్ స్టడీస్, ఏరియా స్టడీస్/రీజనల్ స్టడీస్, డెక్కనీ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ వంటి స్పెషలైజేషన్‌లు ఉన్నాయని అధికారులు బుధవారం తెలియజేశారు. అలాగే యూనివర్శిటీ ఈ సంవత్సరం నుండి మెరిట్ ఆధారితంగా పాష్టో, ఫ్రెంచ్, రష్యన్ భాషలలో ఎం.ఏ ఇన్ లీగల్ స్టడీస్ ప్రోగ్రాంతో పాటు కొత్త సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టింది.

దేశం నలుమూలల విద్యార్థుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని, దరఖాస్తుల సమర్పణకు తేదీ పొడిగించామని యూనివర్సిటీ అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే, ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జూలై 5, 6, 7 తేదీలలో జరుగుతాయని మనూ వర్సిటీ పరీక్షల అధికారి తెలిపారు.

మనూలో (MANUU) వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, కామర్స్ మరియు సైన్సెస్‌లలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను కూడా అందిస్తోంది. ఈ మెరిట్ ఆధారిత కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆగస్టు 30 చివరి తేదీ.

మరిన్ని వివరాల కోసం, ఆన్‌లైన్ దరఖాస్తు, ఇ-ప్రాస్పెక్టస్ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ manuu.edu.inకి లాగిన్ అవ్వండి. ఏవైనా వివరణల కోసం, విద్యార్థులు admissionsregular@manuu.edu.inకి ఇమెయిల్ చేయవచ్చు.  సాధారణ సందేహాల కోసం, అడ్మిషన్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు: ఫోన్ నంబర్లు 6207728673, 9866802414, 6302738370 మరియు 9849847434.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles