31 C
Hyderabad
Tuesday, October 1, 2024

ప్రధాని విదేశీ పర్యటనలన్నీ అదానీ, అంబానీ కోసమేనా?… నెటిజన్ల విమర్శలు!

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ గత ఎనిమిదేళ్లుగా జరిపిన విదేశీ పర్యటనల ఆంతర్యం ఇప్పడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలన్నీ అదానీ, అంబానీ కోసమేనన్న వాస్తవాలు తాజాగా కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. అంబానీ, అదానీ గ్రూపుల పట్ల అభిమానాన్ని చాటుతున్న అనేక ఉదంతాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయటపడుతున్నాయి.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ప్రధానమంత్రి సందర్శించిన దేశాలలో రెండు మెగా వ్యాపార సమూహాలు ప్రధాన విదేశీ కాంట్రాక్టులను పొందడం ఒక ఆనవాయితిగా మారింది. తాజాగా  శ్రీలంక… మన్నార్‌ జిల్లాలో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్‌ పవర్‌ప్లాంటును పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టాలని భారత ప్రధాని నరేంద్రమోదీ, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఎంఎంసీ ఫెర్డినాండో బయటపెట్టిన నాటి నుంచి లంకేయులు అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం మధ్యాహ్నం దేశ రాజధాని కొలంబోలోని మెజెస్టిక్‌ సిటీ వద్దకు ప్రజలంతా చేరుకోవాలని సోషల్‌మీడియాలో సందేశాలు పోటెత్తుతున్నాయి.

శ్రీలంక ప్రభుత్వంపై భారత ప్రధాని నరేంద్రమోదీ ఒత్తిడి తీసుకువచ్చి అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ మౌనం వహించడంపై  దేశంలో నెజిజన్లు నిప్పులు చెరిగారు. మోదీ గద్దె దిగటానికి #ModiSriLankaScam సరిపోదా? దీనిపై విచారణ ఎందుకు జరపరు? అని ఓ నెటిజన్ ఆగ‌్రహంగా ప్రశ్నించారు.  దేశవ్యాప్తంగా పార్టీలు, రాష్ర్టాలు, వర్గాలకు అతీతంగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ పరువు తీసేలా నిస్సిగ్గుగా తన మిత్రుల కోసం దేశ ప్రతిష్ఠను దిగజార్చిన ప్రధాని అంటూ సీనియర్‌ నాయకులు, సీనియర్‌ జర్నలిస్టుల నుంచి మొదలుకొని అన్ని వర్గాల వారు దుమ్మెత్తి పోస్తున్నారు. అదానీ, అంబానీతో అంటకాగుతూ అందినకాడికి దోచుకొంటున్నారని విమర్శిస్తున్నారు.

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో తన మిత్రుడు అదానీకి మేలు చేసే ఏదో ఒక ఎంవోయూ కుదుర్చుకోకుండా తిరిగి రాలేదన్న విషయాలు ఒక్కొక్కటిగా సాక్ష్యాలతో సహా బయటికి రావటంతో మోదీ దిగిపోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.  ట్విటర్‌లో #మోదీ మస్ట్‌ రిజైన్‌కు గంటల వ్యవధిలోనే 94వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి.

శ్రీలంక ఎపిసోడ్ ఒక్కటే కాదు, ఆస్ట్రేలియన్ బొగ్గు దిగుమతుల అంశంలో అదానీ గ్రూప్ ప్రమేయం వివాదాస్పదం కావడంతో నెటిజన్లు… ప్రధాని మోడీ విదేశీ పర్యటనల తీరును లోతుగా పరిశీలించారు. ప్రధాని తన కార్యాలయాన్ని, పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించిన సందర్భాలను ఎత్తి చూపారు. ఏ దేశంలోనైనా ప్రధాని పర్యటన ముగిసిన వెంటనే విదేశీ ప్రభుత్వాలు అదానీ గ్రూప్‌తో లేదా అంబానీ రిలయన్స్ గ్రూప్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, మోదీ విదేశీ పర్యటనల్లో ఇది సర్వసాధారణమైందని వారు పరిశీలనల్లో తేలింది.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని వివిధ దేశాల పర్యటనలు, ఆయన సందర్శించిన దేశాల్లోని ప్రధాన వ్యాపార ఒప్పందాలను ఒకటి లేదా ఇతర వ్యాపార కుటుంబాలకే పరిమితం కావడాన్ని నెటిజన్లు గమనించారు. ఈ ఆరోపణలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, మోడీ విదేశీ పర్యటనలన్నింటిపై విచారణకు ఆదేశించాలని వారిలో చాలా మంది అభిప్రాయపడ్డారు.

ఈ రెండు వ్యాపార బృందాలు లాభదాయకమైన వ్యాపార ప్రాజెక్ట్‌లపై విచారణ జరిపించాల్సిందే. ఉదాహరణకు, నవంబర్ 2014లో ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా, అదానీ గ్రూప్ ఆస్ట్రేలియా ప్రభుత్వం నుండి 200 కి.మీ నారో గేజ్ రైలు ప్రాజెక్టును పొందింది. అదేవిధంగా, రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్ రెండూ 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (బిపిడిబి) నుండి అనుమతులు పొందాయి. 2015 జూన్‌లో మోదీ బంగ్లాదేశ్‌ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదరడం గమనార్హం.

2014 ఆగస్టు మరియు సెప్టెంబరులో మరియు మళ్లీ 2016 నవంబర్‌లో మోడీ జపాన్‌కు చేసిన మూడు పర్యటనలు కూడా సందేహాస్పదంగా ఉన్నాయి. అదానీ గ్రూప్, జూలై, 2018లో జపాన్ సంస్థ (NYK) ఆటో లాజిస్టిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆటోమొబైల్ ఫ్రైట్ రైళ్లను నడపడానికి జాయింట్ వెంచర్‌ను ప్రారంభించింది.

2015 జూలై, డిసెంబరులో ప్రధానమంత్రి రష్యాను సందర్శించారు, దాని తర్వాత రిలయన్స్ గ్రూప్ డిసెంబరు, 2015లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ప్రత్యేకత కలిగిన అల్మాజ్-ఆంటెతో తన ఒప్పందాన్ని ప్రకటించింది. 2017 మే-జూన్‌లో మోడీ రష్యా పర్యటన, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్టోబర్, 2018లో భారతదేశ పర్యటన, అక్టోబర్ 6, 2018న అల్మాజ్-ఆంటెతో రిలయన్స్ గ్రూప్ ఒప్పందం ఖరారు చేయబడింది.

నరేంద్ర మోడీ జూన్, 2016లో యూఎస్‌ సందర్శించిన వెంటనే, రిలయన్స్ గ్రూప్ అమెరికా నౌకాదళం నుండి యుద్ధనౌకల మరమ్మతుల కాంట్రాక్టును పొందుతున్నట్లు ప్రకటించింది, చివరకు ఫిబ్రవరి 2017లో సంతకం చేయబడింది. రిలయన్స్ గ్రూప్‌కు యుద్ధనౌకల మరమ్మతుల విషయంలో పెద్దగా అనుభవం లేదు. ఈ ఒప్పందం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. నవంబర్, 2015లో, మోడీ మలేషియాను సందర్శించారు, ఆ తర్వాత అదానీ గ్రూప్ ఏప్రిల్, 2017లో ఓడరేవు ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకుంది.

అంబానీలు, అదానీలకు సంబంధించిన ఈ వ్యాపార ఒప్పందాలన్నీ కేవలం యాదృచ్ఛికమేనని కొట్టివేయవచ్చా? దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాల్సిందే? విచారణలో మోది నిర్దోషిగా బయటపడాలి. లేదంటే మోదీ ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని నెటిజన్లు చెబుతున్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles