30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణ ట్రాక్టర్లు 60 దేశాలకు వెళ్లాయి… మంత్రి కేటీఆర్!

హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ వదలరు. తెలంగాణలో తయారైన 3,00,001వ ట్రాక్టర్‌ను ప్రారంభించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి మహీంద్రా ట్రాక్టర్ల తయారీ కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఇది స్పష్టమైంది. ఈ సందర్భంగా జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్‌ను కేటీఆర్‌  సందర్శించి.. ట్రాక్టర్‌ నడిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో వెల్లడిస్తూ ‘మహీంద్రాజీ మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్‌ చేసేందుకు నేను రెడీ. అందుకోసం మీ ట్రాక్టర్ల ముందు నిలబడి ఫొటోలకు ఫోజులిస్తా’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా వెంటనే స్పందించారు. ‘కేటీఆర్‌, మీరు తిరుగులేని బ్రాండ్‌ అంబాసిడర్‌ అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మీరు కెమెరా ముందుకొస్తే రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న టాలీవుడ్‌ మిమ్మల్ని తనవైపు లాగేసుకుంటుంది’ అని ఆనంద్‌ చమత్కరించారు.

కేటీఆర్‌ జహీరాబాద్‌లోని మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్‌లో భాగమైన మహీంద్రా ట్రాక్టర్‌ల తయారీ విభాగాన్ని సందర్శించి తెలంగాణలో తయారు చేసిన 3,00,001వ ట్రాక్టర్‌ను విడుదల చేశారు.

మహీంద్రా సంస్థ జహీరాబాద్ ట్రాక్టర్‌ల తయారీ ప్లాంట్‌… తెలంగాణను అతిపెద్ద ట్రాక్టర్ ఎగుమతి కేంద్రాలలో ఒకటిగా నిలిపింది. “భారతీయ మార్కెట్‌కు విస్తృత శ్రేణి ఉత్పత్తులకు కేంద్రంగా ఉండటమే కాకుండా, జహీరాబాద్ ప్లాంట్ యూఎస్‌, జపాన్, యూరప్‌తో సహా 60కి పైగా దేశాలకు ట్రాక్టర్లను ఎగుమతి చేస్తోంది.

2012లో స్థాపించబడిన జహీరాబాద్ ప్లాంట్‌ అతి తక్కువ సమయంలో అతిపెద్ద ట్రాక్టర్ తయారీ కర్మాగారంగా రూపుదాల్సింది. ఇది తెలంగాణలోని ఏకైక ట్రాక్టర్ తయారీదారు. మహీంద్ర సంస్థ జహీరాబాద్‌లో దాదాపు 1,087 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. యూనిట్‌లో 1,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రెండు-షిఫ్ట్ ప్రాతిపదికన సంవత్సరానికి 1,00,000 ట్రాక్టర్ల ఉత్సత్తి సామర్థ్యం కలిగి ఉంది.
ఇది 2013లో ఈ ప్లాంట్‌నుండి మొదటి ట్రాక్టర్‌ను విడుదల అయింది. 2017లో లక్ష యూనిట్ల ఉత్పత్తి మార్కును అధిగమించింది. 2019లో రెండు లక్షల యూనిట్ల మార్కును దాటింది. యూనిట్ 30 నుండి 100 హెచ్‌పి వరకు 330కి పైగా ట్రాక్టర్ వేరియంట్‌లను తయారు చేసే సౌలభ్యాన్ని కలిగి ఉంది.

2020లో ముందుగా, మహీంద్రా సంస్థ జహీరాబాద్‌ ప్లాంట్‌లో ప్రత్యేకంగా ‘K2’ అనే కొత్త ట్రాక్టర్ సిరీస్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. జపాన్‌కు చెందిన మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చరల్ మెషినరీ సహకారంతో లైట్ వెయిట్ ట్రాక్టర్ ప్రోగ్రామ్ అభివృద్ధి చేసారు. అమెరికా, జపాన్, ఆగ్నేయాసియాతో సహా దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం ఈ ట్రాక్టర్‌ను తయారు చేశారు.

మహీంద్రా జహీరాబాద్ రైస్ ట్రాన్స్‌ప్లాంటర్లు మరియు ట్రాక్టర్-మౌంటెడ్ కంబైన్ హార్వెస్టర్‌ల వంటి వ్యవసాయ యంత్రాలను కూడా అందిస్తుంది. వ్యవసాయ పరికరాలను తయారు చేయడంతో పాటు, ఇక్కడి మహీంద్రా యొక్క ఆటోమోటివ్ డివిజన్ జహీరాబాద్‌లో కార్గో, ప్యాసింజర్ వాహనాలను కూడా తయారు చేస్తుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles