23.7 C
Hyderabad
Monday, September 30, 2024

గజ్వేల్కు చేరుకున్న తొలి గూడ్స్ రైలు!

సిద్దిపేట/ గజ్వేల్ : సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. గజ్వేల్ కేంద్రంగా గూడ్స్ రైలు రాకపోకలు మొదలయ్యాయి. గజ్వేల్ లో కొత్తగా ఏర్పాటుచేసిన ఫర్టిలైజర్ రేక్ పాయింట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎఫ్.సీ.ఐ గోడౌన్ నుంచి 21 బోగీల్లో 13 టన్నుల ఎరువులతో వచ్చిన తొలి గూడ్స్ రైలుకు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.

గజ్వేల్ కు తొలి గూడ్స్ రైలు చేరుకుంది. తొలి విడుతగా కాకినాడ నుంచి 13 బోగీలలో 1300 మెట్రిక్ టన్నుల ఎరువుల లోడ్ ను తీసుకుని వచ్చింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ లో ఎరువుల రేక్  పాయింట్ ను మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలోని ఎన్ఎఫ్ సీఎల్ నుంచి గజ్వేల్ కు 12 బోగీల గూడ్సు రైలు 1300 మెట్రిక్  టన్నుల ఎరువుల లోడు తీసుకుని వచ్చింది.  ఈ ఎరువుల రేక్  పాయింట్ కు అనుసంధానంగా సరకు రవాణా జరగనుంది.

మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు పూర్తయిన దాదాపు 43 కిలోమీటర్ల రైల్వే లైన్ ను అనేక పరీక్షల తర్వాత సేఫ్ అని రైల్వే అధికారులు తేల్చారు. దీంతో.. రైల్ చుక్ చుక్ మని దూసుకొచ్చేసింది. సనత్ నగర్, చర్లపల్లి నుంచి ఈ కొత్త లైన్ ను లింక్ చేయనున్నారు. గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో ఎరువుల రేక్ పాయింట్ ఉంది. దీంతోపాటు.. మనోహరాబాద్-కొత్తపల్లి మధ్యలో ఉన్న అన్ని రేక్ పాయింట్లు, పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లను కూడా ఈ రైల్వే లైన్ తో లింక్ చేస్తారు.

ఎరువుల కోసం 4 వేల మెట్రిక్  టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గిడ్డంగులను నిర్మించారు. దీంతో ఇవాళ్టి నుంచి గజ్వేల్ కు గూడ్స్ రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఎరువుల రేక్‌ పాయింట్‌  ప్రారంభ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ లు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి,  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభలో మాట్లాడిన హరీశ్ రావు ఎరువుల రేక్ పాయింట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు దశాబ్దాల పోరాటం అన్నారు. “కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే లైన్ సాధన కోసం ఒత్తిడి పెంచారు. రైల్వే లైన్ కేంద్రం బాధ్యత. కానీ నేడు రైల్ రావడానికి కేంద్రం నిధులు తక్కువ, రాష్ట్ర నిధులు ఎక్కువ. నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య నిధులు ఇచ్చేవారు కాదు. తెలంగాణ వచ్చాక మూడో వంతు నిధులు ఎప్పటికప్పుడు ఇచ్చాం. కొత్తపల్లి – మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేసింది. ఈ లైన్ కోసం 2200 ఎకరాల భూ సేకరణ చేశాం” అన్నారు హరీశ్ రావు. తెలంగాణకు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్  తరలించుకు పోయి తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని ఫైరయ్యారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles