30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకులాల సత్తా!

హైదరాబాద్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన 19 జూనియర్ కాలేజీలు 100 శాతం మార్కులు సాధించాయని టీఎమ్‌ఆర్‌ఈఐఎస్‌ సొసైటీ వెల్లడించింది. మైనారిటీ గురుకులాల పత్రికా ప్రకటనా ప్రకారం… 2021-22 విద్యా సంవత్సరంలో అప్‌గ్రేడ్ చేయబడిన 121 జూనియర్ కళాశాలలు, వీటిలో మొదటి బ్యాచ్ విద్యార్థులు మంచి ఫలితాలతో ఉత్తీర్ణులయ్యారు.

జగిత్యాల బాలికలు-1 విద్యార్థిని ఎస్ హారిక తన మొదటి సంవత్సరం పరీక్షలో 470 మార్కులకు 465 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత తన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి ఇన్ని మార్కులు సాధించడం విశేషం. హారిక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా జీవితంలో స్థిరపడాలని అనుకుంటోంది. ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనే తపనతో ఉంది” అని టిఎమ్‌ఆర్‌ఇఐఎస్ సెక్రటరీ బి షఫీవుల్లా తెలిపారు.

ముఖ్యంగా కెజి-పిజి మిషన్ కింద బాలికల కోసం మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలను స్థాపించినందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లే ఇది సాధ్యమైందని వారు కొనియాడారు.

ఇంటర్‌ తరువాత మైనారిటీ గురుకుల విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రాణించేందుకు జేఈఈ, ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌, క్లాట్‌, ఎన్‌డీఏ, సీఏ పోటీ పరీక్షల కోసం ఇంటెన్సివ్ కోచింగ్‌ను అందజేస్తోందని టిఎమ్‌ఆర్‌ఇఐఎస్ సెక్రటరీ చెప్పారు. సీపీటీ వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేలా కృషి చేసినందుకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు (మైనారిటీల సంక్షేమం) టీఎమ్‌ఆర్‌ఈఐఎస్‌ అధ్యక్షుడు ఏకే ఖాన్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిని అభినందించారు. మైనారిటీ గురుకులాల విద్యార్థులు సాధించిన ఫలితాలు కూడా రాష్ట్ర సగటు కంటే చాలా ఎక్కువగా ఉండటం పెద్ద విశేషమనే చెప్పాలి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles