33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్‌లో ‘ఫార్ములా -ఈ’… వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న రేస్!

హైదరాబాద్: ఐటీలో వెలుగులు విరజిమ్ముతూ విశ్వ నగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్‌ పేరు ఇప్పుడు క్రీడల్లో కూడా మార్మోగనుంది. ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఫార్ములా -ఈ’ రేసు భాగ్యనగర నడిబొడ్డున జరుగనుంది. ‘ఫార్ములా ఈ-రేస్‌’ చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్‌ క్రీడల సమాఖ్య బుధవారం అధికారికంగా ప్రకటించింది. తద్వారా మన దేశం మొట్టమొదటిసారి ఈ రేసింగ్ పోటీలో పాలుపంచుకున్నట్లవుతుంది.

ఈ సందర్భంగా ఫార్ములా ఈ సీజన్ 9 కోసం తాత్కాలిక క్యాలెండర్‌ను ప్రకటించారు.

  • ఫిబ్రవరి 11, 2023న హైదరాబాద్ ఇ-ప్రిక్స్
  • లుంబినీ పార్క్ ద్వారా 2.37k వీధి ట్రాక్
  • ఫిబ్రవరి 11, 2023న హైదరాబాద్ ఇ-ప్రిక్స్

2013లో బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ చివరి F1 ఇండియన్ గ్రాండ్‌ఫిక్స్‌కి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత హైదరాబాద్ ఈ-ప్రిక్స్… మనదేశంలో నిర్వహించబడే మొదటి అతిపెద్ద అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ అవుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా ఈ, క్లీన్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేశాయి. వచ్చే సీజన్‌లో ఫార్ములా ఈ రేసును నిర్వహించేందుకు హైదరాబాద్‌ను అధికారిక ఖరారు చేశారు. ప్రస్తుతానికి ఇది తాత్కాలికంగా ఖరారైనప్పటికీ నిర్ధారించిన తేదీనే ఫార్ములా ఈ రేస్‌ జరుగుతుందని చీఫ్ ఛాంపియన్‌షిప్ అధికారి అల్బెర్టో లాంగో విశ్వాసం వ్యక్తం చేశారు. దాని కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు.

ఫార్ములా ఈ అత్యంత వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన రేస్ కారు (3జీ) తో కొత్త యుగానికి నాంది పలికే సీజన్ 9 యొక్క రౌండ్ 4కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ మోటార్‌ కార్ల తయారీదారులైన మహీంద్రా రేసింగ్, జాగ్వార్, డీఎస్‌ ఆటోమొబైల్స్, నిస్సాన్, పోర్షే, ఎన్‌ఐఓ 333లతో పాటు మాసెరటి, మెక్‌లారెన్‌ వంటి ప్రఖ్యాత మోటార్‌ రేసింగ్‌ సంస్థలు కూడా ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడతాయి.

ఈ-రేస్ నిర్వహణకు హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ట్రాక్‌ గుర్తించారు. డ్రైవెన్ ఇంటర్నేషనల్ సంస్థ ట్రాక్ రూపొందించింది, వీరు అబుదాబిలోని యాస్ మెరీనా సర్క్యూట్‌కి ఇటీవలి అప్‌డేట్‌లపై కూడా పనిచేశారు. ఈ సంస్థ భారతదేశంలోని ఇతర ప్రాజెక్ట్‌లలో కూడా పని చేస్తోంది, ముఖ్యంగా పూణే సమీపంలోని నానోలి స్పీడ్‌వే, ఆంధ్రప్రదేశ్‌లోని మార్క్ వన్ మోటార్ క్లబ్.

ఈ ట్రాక్ హుస్సేన్ సాగర్ సరస్సు పక్కన లుంబినీ పార్క్ గుండా వెళుతుంది. ఈ సందర్భంగా మహీంద్రా రేసింగ్ సీఈఓ, టీమ్ ప్రిన్సిపాల్ దిల్‌బాగ్ గిల్ మాట్లాడుతూ.. రేస్ నిర్వహణకు ఇది అనువైన ప్రదేశం అని అన్నారు.  ట్రాక్ ప్రాంతంలో పౌర నివాసం లేనందున మేము ప్రజా జీవితానికి అంతరాయం కలిగించడం లేదు అని ఆయన వివరించారు. సాయంత్రం లైట్ల వెలుగులో హైదరాబాద్ ఈ-ప్రిక్స్ జరపాలని నిర్వాహకులు చూస్తున్నారని ఆయన వెల్లడించారు.

ఫార్ములా ఈ సీజన్ 9 తాత్కాలిక క్యాలెండర్ ప్రకారం, జనవరి 14న మెక్సికో సిటీ ఈ-ప్రిక్స్‌లో Gen3 కార్లు తమ పోటీని ప్రారంభించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో జనవరి, జూలై 2023 మధ్య రికార్డు స్థాయిలో మొత్తం 18 రేసులు ప్లాన్ చేశారు.

ఈ సందర్భంగా ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఈ మోటార్ స్పోర్ట్స్ కు  హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం ద్వారా ఫార్ములా ఈ-రేసింగ్‌ నిర్వహిస్తున్న పారిస్, రోమ్, లండన్, హాంగ్ కాంగ్, న్యూయార్క్, బెర్లిన్ వంటి 18 గ్లోబల్ నగరాల సరసన హైదరాబాద్ నిలవనుంది.

ఫుల్లీ ఎలక్ట్రిక్ సింగిల్ సీటర్ మోటార్ స్పోర్ట్ ఛాంపియన్ షిప్‌గా పేరొందిన ఫార్ములా ఈ రేస్‌ 2014 బీజింగ్ లో తొలిసారి మొదలైంది. మోటార్ స్పోర్ట్ రేసింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సరికొత్త విప్లవానికి ఈ ఛాంపియన్ షిప్ పాటుపడుతోంది. అర్బన్‌రేస్ ట్రాకుల్లో అద్భుతమైన యాక్షన్, సిటీ సెంటర్ సెట్టింగ్స్ ద్వారా ఈ రేస్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా 60 నగరాలతో పోటీపడి ‘ఈ-రేస్‘ నిర్వహణకు క్యాండిడ్ హోస్ట్‌గా హైదరాబాద్‌ ఎంపికైంది.

ఫార్ములా- ఈ రేస్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఎలక్ట్రిక్ మొబిలిటీని, రినవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించే ఈ రేస్ ద్వారా జీరో కర్బన ఉద్గారాలు వెలుబడతాయి. ఈ గ్లోబల్ రేస్‌కు ఆతిథ్యం ఇవ్వటం ద్వారా హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచ పటంలో మరింత ఇనుమడిస్తుంది. దాంతో పాటు ఈవీలో పయనీర్‌లుగా ఉన్న పలు ఆటోమోటివ్ ఇండస్ట్రీలు హైదరాబాద్‌కు తరలిరానున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles