33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

టెర్రస్ గార్డెనింగ్… ఆసక్తి ఉన్నవారికి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో శిక్షణ!

హైదరాబాద్: ఆరోగ్యకరమైన ఆహారాన్ని కుటుంబానికి అందించాలన్న తపన ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. పచ్చని పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అంటే ఎవరికైనా ఇష్టమే. కానీ వాటిని పెంచడం చాలా శ్రమతో కూడుకున్న పని. పాత తరం పెరటి తోటల నిర్వహణ కనుమరుగైంది. రసాయన పంటలపై ఆధారపడి ఎన్నో రుగ్మతలకు గురవుతున్నాడు. ప్రజలు ఇప్పుడిప్పుడే  ఆరోగ్య సమపార్జనపై  దృష్టి పెట్టడం మొదలెట్టారు. దీంతో మళ్లీ పెరటితోటల పెంపకంపై దృష్టిసారించారు.  డాబా మీద మొక్కల పెంపకానికి శ్రీకారం చుడుతున్నారు.

అయితే ఈ మొక్కలను  వర్షం, ఎండ నుంచి ఎలా కాపాడాలి. తెగుళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి,  ప్రతిరోజూ నీళ్లు పెట్టొచ్చా. ఎరువులు తయారు చేయాలి. కలుపు తీయడం ఎలా? . ఈ పనులన్నీ చేయడంలోనే మెళకువలు ఎవిరిస్తారు? ఏ సీజన్‌లో ఏ విత్తనాలు నాటాలి, మొక్కల పెంపకానికి ఏ రకం మట్టి వాడాలి… ఇలా సవాలక్ష ప్రశ్నలు వేధిస్తుంటాయి.

వీటన్నింటికి సమాధానంగా తెలంగాణ ఉద్యానవన శాఖ టెర్రస్ గార్డెనింగ్‌లో మెళకువలు నేర్పేందుకు ముందుకొచ్చింది. దీనిపై ఆసక్తిగల వ్యక్తులకు నగరంలో నెలకు రెండుసార్లు మిద్దెమీద  వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

నాంపల్లిలోని రెడ్ హిల్స్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు పక్కనే ఉన్న ఉద్యాన శిక్షణా సంస్థలో జూలై రెండవ మరియు నాల్గవ ఆదివారాలలో (జూలై 9 మరియు 24) శిక్షణా సమావేశం జరుగుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రవేశ రుసుము రూ.100.

మరిన్ని వివరాల కోసం 919705384384, 917674072539 మరియు 917997724983 నంబర్లకు కాల్ చేయండి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles