31 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. గూగుల్ స్ట్రీట్ వ్యూ మళ్లీ వచ్చేసింది!

న్యూఢిల్లీ: భారత్‌లో స్ట్రీట్‌ వ్యూ సేవలను గూగుల్‌ మళ్లీ తీసుకొచ్చింది. దేశీయ ఐటీ సంస్థలు టెక్‌ మహీంద్రా, మ్యాపింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ జెనిసిస్‌తో కలిసి హైదరాబాద్‌తో సహా దేశంలోని 10 నగరాలు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పూణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్‌, అమృత్‌సర్‌లలో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు గూగుల్‌ బుధవారం ప్రకటించింది. ఆయా నగరాల్లో లక్షా 50 వేల కిలోమీటర్లు స్ట్రీట్‌ వ్యూలో కవర్‌ అయినట్టు గూగుల్‌ పేర్కొన్నది.

ఈ ఏడాది చివరి నాటికి 50కి పైగా నగరాల్లో ఈ సేవలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ స్ట్రీట్‌వ్యూ ద్వారా రోడ్లు, వీధులను 360 డిగ్రీల కోణంలో విశాలమైన హైక్వాలిటీ దృశ్యాలను (పనోరమిక్‌ ఇమేజ్‌లు)వీక్షించవచ్చు. కంప్యూటర్‌లో గానీ, మొబైల్‌లో గానీ గూగుల్‌ మ్యాప్స్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా, భద్రతాపరమైన కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం గతంలో ఈ స్ట్రీట్‌వ్యూ సేవలను అనుమతించలేదు.

తాజాగా స్ట్రీట్‌వ్యూతోపాటు మ్యాప్స్‌లో స్పీడ్‌ లిమిట్‌ సేవలను సైతం గూగుల్‌ తీసుకొచ్చింది. మొదటగా బెంగళూరు నుంచి ట్రాఫిక్‌ పోలీసుల భాగస్వామ్యంతో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. కీలకమైన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించడంలో పోలీసులకు సహకారంగా ఉండే ఈ సేవలను హైదరాబాద్‌, కోల్‌కతా నగరాలకు కూడా విస్తరించనున్నట్టు గూగుల్‌ తెలిపింది.

ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్స్ ఉపాధ్యక్షులు మిరియం కార్తీక డేనియల్ మాట్లాడుతూ… భారతదేశంలో స్ట్రీట్ వ్యూ ప్రారంభించడం, వాస్తవికంగా లొకేషన్‌లను సందర్శించడం నుండి స్థానిక వ్యాపారాలు, స్థాపనల గురించి మెరుగైన అనుభూతిని పొందడం వరకు మరింత ఉపయోగకరమైన వినియోగదారు అనుభవాన్ని అందించడంలో కీలకంగా ఉంటుందని అన్నారు. అంతేకాదు గాలి నాణ్యత సమాచారాన్ని అందించడానికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) కూడా సహకారాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు.

జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సాజిద్ మాలిక్ మాట్లాడుతూ… “భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని వీధుల దృశ్యాలను చిత్రీకరించిన మొట్టమొదటి సంస్థ మాదే.  మా బృందం ఇప్పటికీ భారతీయ నగరాలను వేగంగా ఫోటో తీస్తోంది, ఆయా నగరాల యొక్క అద్భుతమైన వీధులు, ల్యాండ్‌మార్క్‌లకు జీవం పోస్తోంది.

 

స్ట్రీట్ వ్యూ ఎలా వాడాలి..
గూగుల్ మ్యాప్స్‌ యాప్‌లోకి వెళ్లి లోకేషన్ పేరును టైప్ చేసి.. సెర్చ్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ కింది భాగంలో స్ట్రీట్ వ్యూ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయాలి. అప్పుడు స్ట్రీట్ వ్యూలో ఆ ప్రాంతం మొత్తం కనిపిస్తుంది. లేకపోతే మ్యాప్‌పై కనిపించే లేయర్స్ సింబల్‌పై ట్యాప్ చేసి కూడా స్ట్రీట్ వ్యూను ఎనేబుల్ చేసుకోవచ్చు.

స్ట్రీట్ వ్యూ ఎలా ఉపయోగపడుతుందంటే..
నగరంలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఆ సమీపంలోని ల్యాండ్‌మార్క్‌లను స్ట్రీట్ వ్యూ ద్వారా స్పష్టంగా చూడవచ్చు. ఆ ప్రాంతం మొత్తం ఈ వ్యూలో రియలస్టిక్‌గా కనిపిస్తుంది. అందువల్ల వెళ్లాలనుకున్న గమ్యానికి సులువుగా చేరుకోవచ్చు. మొత్తంగా సెర్చ్ చేసిన ప్రాంతంలో ఏం ఉన్నాయో మన డివైజ్‌లోనే స్పష్టంగా చూడవచ్చు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles