28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

పాతబస్తీ ఐటీఐ రోదన… అధికారులూ నాపై కాస్త దృష్టి పెట్టరూ….!

హైదరాబాద్: పాతబస్తీలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ, బహదూర్‌పురా (గవర్నమెంట్‌ఐటిఐ) రోదిస్తోంది. ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, మెటీరియల్, పారిశుధ్యం కొరతతో అల్లాడుతోంది. ఇక ప్రవేశ ద్వారం వద్ద భారీ చెత్త డంపింగ్ పాయింట్ విద్యార్థులు, అధ్యాపకుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఆక్రమణల పరిధిని మినహాయించి, 6.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సంస్థ, పారిశ్రామిక రంగంలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణను అందించే ఏకైక లక్ష్యంతో 1972లో స్థాపించారు.

ఈ ఐటీఐలో 12 వేర్వేరు ట్రేడ్‌లలో 450 మంది విద్యార్థులు పారిశ్రామిక శిక్షణ పొందుతున్నారు. ఈ ఐటీఐలో హైదరాబాద్‌ నగరంనుంచే కాక చుట్టు పక్కల జిల్లాల నుండి విద్యార్థులు చేరుతుంటారు. వందలమంది విద్యార్థులున్న ఈ ఐటీఐ వెళ్లేందుకు సరైన దారి లేదు. జాతీయ రహదారి-44లో జూ పార్క్ నుండి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఇరుకైన లేన్ సంస్థకు వెళ్లే ఏకైక ప్రవేశ ద్వారం. సంవత్సరాల తరబడి ఆక్రమణలు కొనసాగడంతో ఐటీఐ ప్రాంగణం నానాటికి కుచించుకుపోతోంది. మరోవంక స్థానిక నివాసులకు రోడ్డు కోసం ఐటీఐ మధ్య ఇరుకైన మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతం మధ్య ఐటీఐ ఉండటంతో, ఇన్‌స్టిట్యూట్ చుట్టుపక్కల నివసించే ప్రజలు I.T.I గేటు దగ్గర చెత్తను వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కూడా అక్కడే మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయటంతో ఆ ప్రాంగణమంతా బహిరంగ డంపింగ్ పాయింట్‌గా మార్చింది. నగర పరిధిలో బహిరంగ చెత్త డంపింగ్‌ను రద్దు చేస్తామని చెప్పిన జీహెచ్‌ఎంసీ గానీ, జనరల్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ పర్యవేక్షణలో గానీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో అధ్యాపకులు, విద్యార్థులు రోజూ ఇబ్బందులు పడుతున్నారు.

ఐటీఐ చుట్టూ పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచకపోవడంతో దయనీయ స్థితిపై ప్రతిఒక్కరూ అవేదన చెందుతున్నారు. ఓల్డ్ సిటీలోని ప్రభుత్వ ఐటీఐ శిక్షణ అధికారి కె.శ్యాంసుందర్ మాట్లాడుతూ, “ఐ.టి.ఐ. గేట్ ముందు బహిరంగ డంపింగ్ పాయింట్‌ ఉండటంతో… ఐటీఐ ప్రవేశ ద్వారం అంతా మురికి కూపంలా పరింది. దీంతో స్థానికులు, విద్యార్థులు అటుగా వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రవేశద్వారం వద్ద డంపింగ్‌ పాయింట్‌ వల్ల అధ్యాపకులు, విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది. ఈ సమస్యను అధికారులు జీహెచ్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles