28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈవీ చార్జింగ్, బయో డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం!

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా… రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రధాన కార్ పార్కింగ్ వద్ద EV (ఎలక్ట్రిక్ వెహికల్) ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. అంతేకాదు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సెంటర్‌లో బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ ‌కూడా ప్రారంభమైంది.

ఎలెక్ట్రిక్ ఛార్జింగ్ సేవను పొందాలనుకునే EV వినియోగదారులందరికీ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటుంది. 30 KWతో, ఇది ఒక ఫోర్ వీలర్ వాహనాన్ని గంటలో ఫుల్ ఛార్జ్ చేస్తుంది. ఈ ఛార్జింగ్ స్టేషన్ యాప్ ద్వారా పని చేస్తుంది. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (IOS) యాప్ మొబైల్ పరికరాల ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు.

విమానాశ్రయంలో EV ఛార్జింగ్ స్టేషన్ వల్ల ప్రయోజనాలు:

• EV స్టేషన్లను నెలకొల్పడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సహం లభిస్తుంది.

• ఎలక్ట్రికల్ వాహనాలు కాలుష్యాన్ని నివారిస్తాయి, విమానాశ్రయ ప్రాంగణం చుట్టూ పరిసర శబ్దాలను నియంత్రణలో ఉంచుతాయి.

• విమానాశ్రయ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ని మరింత మెరుగుపరుస్తుంది.

భారతీయ విమానాశ్రయాలలో మొట్టమొదటిసారిగా, జీఎమ్మార్ విమానాశ్రయం బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించిది. సంప్రదాయ, మార్పు చేయని డీజిల్ ఇంజిన్లను కూడా బయోడీజిల్ నడుపుతుంది. బరువు రీత్యా బయోడీజిల్ 11% ఆక్సిజన్ ఉంటుంది. దీనిలో సల్ఫర్ ఉండదు. ఇది దాదాపు 80% తక్కువ CO2 (కార్బన్ డయాక్సైడ్), 100% తక్కువ SO2 (సల్ఫర్ డయాక్సైడ్) ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. బయోడీజల్ వాడకం డీజిల్ ఇంజిన్ల జీవితాన్ని పొడిగిస్తుంది ఎందుకంటే ఇది పెట్రోలియం డీజిల్ కంటే మెరుగ్గా లూబ్రికేట్ చేస్తుంది. దీని వల్ల డీజిల్ వినియోగం, ఆటో ఇగ్నిషన్, పవర్ అవుట్‌పుట్‌, ఇంజిన్ టార్క్ ప్రభావితం కావు. ఇది ఇంజన్ గోడలను మరింత మెరుగ్గా శుభ్రపరుస్తుంది.

బయో డీజిల్ వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలు:

  •  బయోడీజిలు గ్లోబల్ వార్మింగ్ మరియు గ్రీన్ హౌస్ ప్రభావం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
  • కార్బన్ మోనాక్సైడ్ (CO), సల్ఫర్ ఆక్సైడ్ (SO) వంటి ప్రమాదకర వాయువుల విడుదల ఉండదు. ఇది వాహనాల ఇంజన్ జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
  • వాయు కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడంలో బయోడీజిల్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, అందువల్ల పొగమంచు, ఆమ్ల వర్షాలు తగ్గుతాయి.

జీరో-కార్బన్ ఎమిషన్ ఎయిర్ పోర్టుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న మేం వివిధ పర్యావరణ అనుకూల చర్యలను కొనసాగిస్తామని ఎయిర్ పోర్ట్ సీఈఓ ప్రదీప్ పణికర్ అన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సుస్థిర ఇంధనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అటువంటి ఇంధనం అందుబాటులో ఉండటం విమానాశ్రయం, దాని చుట్టుపక్కల పర్యావరణాన్ని పరిరక్షించడంలో మా ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహజ వనరుల సమర్థంగా వినియోగించుకుంటూ, ఉత్తమ వ్యర్థాల నిర్వహణ విధానాలను అవలంబించడం ద్వారా అనేక పర్యావరణ కేంద్రీకృత కార్యక్రమాలను చేపడుతోంది. గ్రీన్ బిల్డింగ్స్, క్లీన్ ఎనర్జీ, కర్బన ఉద్గారాల నియంత్రణ, రీసైక్లింగ్, జల సంరక్షణ, వాననీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, సోలార్ విద్యుత్ వినియోగం, క్లౌడ్ ఆధారిత నీటిపారుదల నియంత్రణ వ్యవస్థ వాటిలో కొన్ని. GHIAL మొత్తం సోలార్ పవర్ సామర్థ్యం ఇప్పుడు 10 మెగావాట్లకు పెరిగింది. ఈ సోలార్ పవర్ ఉత్పాదనతో, GHIAL. యొక్క 50% శక్తి అవసరాలు తీరుతుతున్నాయి. దీని వల్ల దాదాపు 28 లక్షల కిలోల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. ఇది 1.4 లక్షలు పూర్తిగా పెరిగిన చెట్లను కాపాడటంతో సమానం

.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles