24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

గర్భిణీలకు కేసీఆర్ కానుక… వచ్చే నెల నుంచే కొత్త పథకం… కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్‌!

  • కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్‌ పంపిణీకి ఏర్పాట్లు
  • ఖర్జూరం, నెయ్యి, ఇతర బలవర్ధక పదార్థాలు
  • బాక్స్‌ లేదా ఏదైనా బ్యాగ్‌తో కిట్‌ తయారీ
  • ముందుగా 9 జిల్లాల్లో ఇచ్చేందుకు ప్రణాళిక

హైదరాబాద్: వచ్చే నెలలో  తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలో కొత్త పథకం అమలుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో మాతా శిశు ఆరోగ్యం (ఎంసీహెచ్)పై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణుల కోసం ‘కేసీఆర్‌ న్యూట్రిషనల్‌ కిట్‌’ను ప్రారంభించనుంది. ముఖ్యంగా తెలంగాణలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల పోషకాహార స్థితిని మెరుగుపరచడమే కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌ల లక్ష్యం.

గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఈ న్యూట్రిషన్ కిట్‌ ఉపయోగపడుతుందని వైద్యవర్గాలు అంటున్నాయి. గర్భం దాల్చాకా మూడో నెలలో ఒకసారి, ఐదో నెలలో మరోసారి దీన్ని అందజేయనున్నారు. ఇప్పటికే తమిళనాడులో ఇటువంటి పథకం అమలవుతోంది. కొన్ని నెలల క్రితం రాష్ట్రం నుంచి మహిళా ఐఏఎస్​ల బృందం తమిళనాడుకు వెళ్లింది. ‘అమ్మకిట్‌’ పేరుతో అక్కడ అమలవుతున్న పథకం తీరు తెన్నులపై అధ్యయనం చేసింది. అక్కడిలాగే తెలంగాణలోనూ ఓ పథకాన్ని అమలు చేయొచ్చంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ కార్యక్రమం ద్వారా ఏటా 1.25 లక్షల మంది లబ్ధి పొందుతారని ఆ వర్గాలు తెలిపాయి.

గర్భిణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ సహా తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ పౌష్టికాహార కిట్‌లను ప్రారంభించనున్నారు.

ఒక్కో పౌష్టికాహార కిట్‌కు రూ.2,000 ఖర్చవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ఏఎన్‌సీ పరీక్షల సమయంలో గర్భిణులకు రెండుసార్లు అందజేస్తామన్నారు. కిట్‌లో రెండు కిలోల న్యూట్రీషియన్ మిక్స్ పౌడర్, రెండు బాటిళ్లు, కిలో ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్‌లు, 500 గ్రాముల నెయ్యి ఉంటాయి.

పౌష్టికాహార కిట్‌లలో ప్రొటీన్లు, మినరల్స్,  విటమిన్లు ఉంటాయి, ఇవి రక్తహీనతను తగ్గించడంలో తోడ్పడతాయి. తాజాగా ఈ న్యూట్రీషన్‌ కిట్‌తో రక్తహీనత తగ్గి గర్భిణలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. అంతేకాదు తొమ్మిది జిల్లాల్లోని గర్భిణీ స్త్రీలలో హిమోగ్లోబిన్ శాతాన్ని మెరుగుపరచడంలో చాలా దోహదపడతాయని ఆరోగ్య మంత్రి టి హరీశ్ రావు శనివారం ఇక్కడ తెలిపారు. ఈ కిట్‌ వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, అలాగే తల్లీబిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వారు వెల్లడించారు.

2017-18 జూన్‌లో కేసీఆర్‌ కిట్‌లను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 13.30 లక్షల కేసీఆర్‌ కిట్‌లు పంపిణీ చేశామని, గర్భిణులకు ఆర్థిక ప్రోత్సాహక పథకంలో భాగంగా రూ.1200 కోట్లు విడుదల చేశామని మంత్రి తెలిపారు.

‘‘కేసీఆర్ కిట్‌ల వల్ల గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 66.8 శాతానికి పెరిగాయి. ఇది కాకుండా, గత ఒక సంవత్సరంలో, మా స్థిరమైన ప్రయత్నాల వల్ల, మేము ఆగస్టు, 2021 లో ప్రభుత్వ ఆసుపత్రులలో సి-సెక్షన్‌లను 62 శాతం నుండి ఈ ఆగస్టులో 56 శాతానికి తగ్గించగలిగాము, ”అని హరీష్ రావు చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles