28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం… సీఎం కేసీఆర్ మండిపాటు!

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాన మంత్రి చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. కృష్ణా నదీ జలాల వివాదాలు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనుమతులు వంటి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. గత ఎనిమిదేళ్లలో 100కు పైగా దరఖాస్తులు ఇచ్చినప్పటికీ  వాటిని క్లియర్ చేయడంలో ప్రధాని విఫలమయ్యారని కేసీఆర్ అన్నారు.

మంగళవారం వికారాబాద్‌లో సమీకృత జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించి, మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగని సభలో సీఎం చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ ‘‘తెలంగాణ సమస్యలను లేవనెత్తే దమ్ము ఇక్కడి బీజేపీ నేతలకు లేదు. తన కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు చేసిన ప్రయత్నాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, టీఆర్‌ఎస్ పార్టీ కూడా బీజేపీ నేతలపై నినాదాలు, జెండాలతో తిప్పికొడుతుందని హెచ్చరించారు.

స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశాన్ని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంపై ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని, కానీ నిర్దిష్టమైన ప్రకటన ఏమీ లేదని, ఆయన ప్రసంగంలో వాస్తవం లేదని ముఖ్యమంత్రి అన్నారు. “బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది, నిరుద్యోగం తగ్గలేదు. ఆర్థిక వృద్ధి క్షీణిస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని తిరస్కరించి, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అనేక సంక్షేమ పథకాలు, సమగ్ర అభివృద్ధి అమలులో తెలంగాణకు మరే రాష్ట్రం సాటిరాదని కేసీఆర్ అన్నారు.

వికారాబాద్‌లోని స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్త్రీ పురుషులను పొరుగున ఉన్న కర్ణాటకకు స్టడీ టూర్‌లకు తీసుకువెళ్లి తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చి చూడాలన్నారు. రాయచూరు జిల్లాను తెలంగాణలో కలపాలని లేదా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు.

‘‘గతంలో ఇతర రాష్ట్రాల్లో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో మూడు నుంచి నాలుగు ఎకరాలు కొనుగోలు చేసేవారు. కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి, ఇతర రాష్ట్రాల్లో మూడు నుంచి నాలుగు ఎకరాలు కొంటున్నారు’’ అని చంద్రశేఖర్ రావు అన్నారు.

రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా, కేంద్ర ప్రభుత్వం బాగాలేకపోతే ఆశించిన అభివృద్ధి కాదు. కేంద్రంలో రాష్ర్టాల హక్కులను గౌరవించే, ప్రజల సంక్షేమాన్ని చూసే ఉత్తమమైన ప్రభుత్వం రావాలి. ఆ దిశగా మనం సిద్ధం కావాలి. దేశ పరిస్థితి దిగజారుతున్నది. నిరుద్యోగం పెరుగుతున్నది. రూపాయి విలువ పడిపోతున్నది. ఏనాడూ లేనటువంటి పరిస్థితులు వస్తున్నాయని సీఎం వాపోయారు.

24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో పాటు రైతులకు సరిపడా నీటిని అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కానీ సంస్కరణల ముసుగులో వ్యవసాయ బావుల వద్ద మోటార్లకు మీటర్లు బిగించాలని కేంద్రం సూచించిందని అన్నారు.

సింగరేణిలో టన్నుకు రూ.4000కి బొగ్గు లభిస్తున్నప్పటికీ, ఇండోనేషియా, ఆస్ట్రేలియాల నుంచి బొగ్గును సేకరించాల్సిందిగా రాష్ట్రాలను కోరడం జరిగిందని, ఒక్కో టన్నుకు దాదాపు రూ.30,000 వెచ్చించి, “ఇదంతా కార్పొరేట్ దిగ్గజాలకు మేలు చేసేందుకేనని సీఎం అన్నారు.

అందుకే మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి, మంచి ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చే క్రతువులో భాగస్వాములం కావాలి. . ఇటువంటి దుర్మార్గులను తరిమికొట్టి అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలని కేసీఆర్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles