24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్ పార్కుల్లో త్వరలో ‘రోప్ వే’ ఏర్పాటుకు కసరత్తు!

హైదరాబాద్:  నగర అవసరాలకు అనుగుణంగా  ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని  అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకుల నిర్మాణాన్ని చేపట్టింది.  వీటిని. హరితహారంలో భాగంగా హైదరాబాద్‌ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో కొద్ది భాగాన్ని అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్‌ సిటీ అయిన నగరానికి పర్యావరణ అవసరాలు తీరేలా మొదటి దశలో 109 అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకులలో పార్కుల  అభివృద్ధికి చర్యలు చేపట్టారు.

నగరం  శరవేగంగా విస్తరిస్తోంది. ఔటర్‌కు ఇరువైపులా  అనేక కొత్త కాలనీలు, నివాస ప్రాంతాలు వెలిశాయి. దీంతో శివారు ప్రాంతాలను ఆనుకొని ఉన్న పట్టణ అడవుల్లో కొంతభాగాన్ని  ఉద్యానాలుగా మార్పు చేయడం వల్ల  వివిధ ప్రాంతాల ప్రజలకు పార్కుల్లో ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది.

►ప్రతి అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో తప్పనిసరిగా ప్రవేశ ద్వారం, నడకదారి, వ్యూ పాయింట్‌ ఏర్పాటు ఉండేలా ఏర్పాటు చేశారు.
►పిల్లలకు  ఆట స్థలం, యోగా షెడ్, సైక్లింగ్, వనదర్శిని కేంద్రం వంటి వాటికి ఈ పార్కుల్లో  ప్రాధాన్యమిస్తున్నారు. పార్కు కోసం కేటాయించిన అడవిని మినహాయించి మిగతా అటవీప్రాంతాన్ని కన్జర్వేషన్‌ జోన్‌గా పరిరక్షణ చర్యలు చేపడతారు. జీవ వైవిధ్యం, నీటి వసతి వంటి సదుపాయాల పెంపునకు చర్యలు చేపట్టారు.

అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని మరింత ఆకర్షీణంగా మలిచేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. అందుకోసం ఈ పార్కుల్లో రోప్‌ వేలను సిద్ధం చేస్తోంది. తద్వారా పర్యాటకరంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు స్పెషల్‌ సీఎస్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ మార్గదర్శకత్వంలో అర్బన్‌ ఫారెస్టు పార్కుల్లో జిప్‌లైన్‌, స్కై సైక్లింగ్‌ లాంటివి ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. జిప్‌లైన్‌ నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ట్విటర్‌లో ఒకరు కోరడంతో ఇప్పటికే చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్‌ బదులిచ్చారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles