28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘డార్క్ వెబ్’ ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా… ముఠా గుట్టు రట్టు చేసిన నార్కోటిక్ వింగ్!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నగరంలో ”డార్క్‌ వెబ్‌ వెబ్‌సైట్‌ ద్వారా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా, పోలీసులు డార్క్ వెబ్ కింగ్‌పిన్‌లుగా అభివర్ణించిన ఇద్దరు నిందితులను నార్కోటిక్‌ పోలీసులు అరెస్టు చేశారు.  వీరిని నరేంద్ర ఆర్య అలియాస్ హోలీ షాప్, ఫర్హాన్ మహమ్మద్ అన్సారీ అలియాస్ ట్రీమినేటర్‌గా పోలీసులు గుర్తించారు.

హుమయూన్‌ నగర్‌లో డ్రగ్స్‌ అమ్మేందుకు యత్నించిన మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.9లక్షల విలువైన సరకును నార్కోటిక్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్కర్ష్‌ ఉమంగ్‌ అలియాస్‌ అషు, సాహిల్‌ శర్మ, అబ్దుల్లా ఖాన్‌, ఇంద్ర కుమార్‌, చరణ్‌ కుమార్‌, పి. భూషణ్‌ రాజ్‌ హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. అంతేకాదు అదనంగా మరో 30 మంది మాదకద్రవ్యాలను ఉపయోగించేవారిని గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ‘

గోవాకు చెందిన నరేంద్ర ఆర్య అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించాం. అతడు ఏడాది కాలంగా ఈ దందాతో దాదాపు రూ.30లక్షల లావాదేవీలు చేశాడు. దేశవ్యాప్తంగా 450 మంది వినియోగదారులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు గుర్తించాం. రాజస్థాన్‌కు చెందిన ఫర్హాన్‌ అహ్మద్‌ అనే మరో వ్యక్తిని కూడా గుర్తించి అరెస్టు చేశాం. అతడు రూ.15లక్షల లావాదేవీలు చేసినట్లు తేల్చాం. యాప్‌లో రకరకాల పేర్లతో నకిలీ ఐడీలు సఅష్టించి డ్రగ్స్‌ వీరు సరఫరా చేస్తున్నారు. వాటన్నింటిపై నిఘా పెట్టాం.

ఇతర రాష్ట్రాల్లో వాళ్లు నగరానికి డ్రగ్స్‌ తీసుకొచ్చేందుకు భయపడుతున్నారు. కానీ, గోవా, బెంగళూరు, ఢిల్లీ వెళ్లి డ్రగ్స్‌ తీసుకొస్తున్నారు. ఈ ముఠాపై దృష్టి సారించాం. సంపన్నులే లక్ష్యంగా డ్రగ్స్‌ దందా సాగుతోంది. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిగాక కొరియర్‌లో డ్రగ్స్‌ సప్లయి చేస్తున్నారు. వాటన్నింటిపై నిఘా పెట్టినట్లు పోలీసులు వివరించారు.

ఈ హైటెక్ పద్ధతులు ద్వారా కొనసాగుతున్న మత్తు దంతా పోలీసులను ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ సందర్భంగా మత్తుపదార్థాల విక్రేతలనే కాకుండా,  30 మంది కస్టమర్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కావడం ఆందోళన కలిగించే అంశం. ‘మీ పిలల్లకు వచ్చే పార్సిళ్లను పరిశీలించాలి’ అని తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ విజ్ఞప్తి చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles