33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

విద్యార్థులకు షాక్… ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెంపు!

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కోర్సు ఫీజులు పెరగడంతో ఇంజినీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులు మరింత డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. నేటి నుంచి ఇంజినీరింగ్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫీజు ఎలా భరిస్తారనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజులు పెంచుతూ హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం షాక్‌కు గురి చేసిందని ఇంజినీరింగ్ చదవాలని ఆకాంక్షిస్తున్న విద్యార్థి రమేష్ అన్నారు.

ఫీజులు ఎలా భరించాలో తెలియడం లేదు. ‘‘2018లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులకు అడ్మిషన్ ఫీజు రూ. 18,000 నుంచి రూ. 35,000 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు అది దాదాపు రూ. 35,000 నుంచి రూ. 50,000. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకు ఫీజు దాదాపు రూ. లక్ష, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులకు ఇది దాదాపు రూ. 1.20 లక్షల ఫీజు నిర్ణయించారు.

ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫీజులు పెంచడం సమంజసం కాదు. పెరుగుతున్న ఫీజుల వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే యూనివర్సిటీ అధికారులు మాత్రం విద్యార్థులను పట్టించుకోవడం లేదని, గ్రౌండ్ లెవెల్లో విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మరో ఇంజినీరింగ్ విద్యార్థి అన్నారు.

మరోవంక తెలంగాణలోని ప్రముఖ ప్రైవేటు కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్ ప్రారంభించడంతో… . కళాశాలలు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. ఇప్పటి వరకు 79 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టు నుంచి అనుమతి పొందగా.. మరికొన్ని కాలేజీలు అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ ఫీజులను సవరిస్తారు.

అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఫీజు ఎంత మేర పెరిగిందనే వివరాలను కౌన్సెలింగ్ సమయంలో అధికారులు వెల్లడించక పోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది.మరోవైపు ఫీజు రీఎంబర్స్​మెంట్ పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం కోసం.. బీసీ, ఈబీసీలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles