31 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్‌లో సోలార్ రూఫింగ్ సైక్లింగ్ ట్రాక్… నేడు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన!

హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్ వాసులకు మరో అధునాతన సౌకర్యం అందుబాటులోకి రానుంది. దక్షిణ కొరియా  తరహాలో సోలార్ రూఫ్‌తో కూడిన 23 కిలోమీటర్ల  వినూత్నమైన సైకిల్ ట్రాక్‌కు నేడు మంత్రి కేటీఆర్  శంకుస్థాపన చేయనున్నారు.

2023 వేసవిలోపు ఈ ట్రాక్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్ వెంబడి (నానక్ రాంగూడ -TSPA & నార్సింగి-కొల్లూరు స్ట్రెచ్)  23 కి.మీ పొడవు, 4.5 మీటర్ల వెడల్పు గల సైకిల్ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ట్రాక్ పై 16 MW ఉత్పత్తి చేసే సౌర ఫలకాలను అమర్చనున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా సమాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

రెండు కారిడార్లలో 23 కిలో మీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసే సోలార్ సైకిల్ ట్రాక్ ఐటీ కారిడార్ నగర వాసులకు ఎంతగానో ఉపయోగపడనున్నది. టీఎస్‌రెడ్‌కో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నది. ఈ సోలార్‌ ప్యానెళ్ల ద్వారా 16 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందు కోసం 88.12 కోట్లతో HMDA-HGCL డిజైన్లను రూపొందించారు. నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14.50 కిలో మీటర్ల మేర ఒక కారిడార్. పోలీసు అకాడమీ జంక్షన్ నుంచి నానక్‌రాంగూడ వరకు 8.50 కిలో మీటర్ల మేర మరో కారిడార్ ద్వారా సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. దారిపొడవునా ఫుడ్ కోర్టులు, అత్యంత కట్టుదిట్టమైన భధ్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్ కు ఒక ట్రెండ్‌సెట్టర్‌గా మారనుందని హెచ్ఎమ్డీఏ అంటోంది. పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న సైకిల్ ట్రాక్ ను కోకాపేట్‌లో అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ప్రతిపాదించిన 23 కిలోమీటర్ల సోలార్ సైక్లింగ్ ట్రాక్‌లో ఈ ట్రాక్ భాగం. “ట్రాక్‌ను పైలట్ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, మొత్తం 23-కిమీల విస్తీర్ణంలో నిర్మిస్తారు” అని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) అధికారి ఒకరు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నిర్మాణంలో ఉన్న సైకిల్ ట్రాక్‌ల్లా  కాకుండా, ఈ సైకిల్ ట్రాక్ సైక్లిస్టులకు ఎండ, వర్షం ఇతర కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణను అందిస్తుంది. అలాగే సాధారణ ట్రాఫిక్ నుంచి దూరంగా ఉండడంతో ప్రజల భద్రతకు  భరోసా ఇస్తుంది.

తాగునీరు, సైకిల్ రిపేర్ షాపులు కూడా ట్రాక్ పక్కన ఏర్పాటుచేయనున్నారు.  ఇవి  24×7 లైటింగ్ తో ఉంటాయి. లైటింగ్ కోసం సోలార్ రూఫ్ ఏర్పాటుచేస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ (RESCO) మోడల్‌ను స్వీకరించారు. దీని ప్రకారం ఒక RESCO ఆపరేటర్ సోలార్ రూఫ్ కోసం అయ్యే వ్యయాన్ని పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారులు చెప్పారు. ఇదే కంపెనీ దీనిని 25 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు చూడనుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles