33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు హైదరాబాద్‌తో అనుబంధం!

హైదరాబాద్: బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది.   క్వీన్ ఎలిజబెత్ II మరణంపై ప్రపంచం స్పందిస్తుండగా, 39 సంవత్సరాల క్రితం ఆమె నగరాన్ని సందర్శించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకునే వారు హైదరాబాద్‌లో కూడా ఉన్నారు. భారత్​ పర్యటనలో భాగంగా ఓసారి హైదరాబాద్​ వచ్చిన ఆమె.. నాలుగు రోజుల పాటు నగరంలో గడిపారు. పలు చారిత్రాక ప్రాంతాలను సందర్శించారు. బీహెచ్‌ఈఎల్‌, ఇక్రిశాట్‌, కుతుబ్‌షాహి సమాధులను సందర్శించారు.

1983 నవంబరులో రాణి ఎలిజబెత్‌ తన భర్త ఫిలిప్‌తో కలిసి 10 రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు  హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఎలిజబెత్‌ దంపతులు సికింద్రాబాద్‌, బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చికి వెళ్లారు. తమ 36వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ చర్చిలోనే జరుపుకున్నారు.  క్వీన్‌ విక్టోరియా ఇచ్చిన నిధులతో 1847లో ఈ చర్చిని నిర్మించారు.  ఎలిజబెత్ II హైదరాబాదు పర్యటన హోలీ ట్రినిటీ చర్చి ప్రెస్‌బైటర్ కుమారులకు అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది.  వీరే జోయెల్, జాషువా హామిల్టన్, రెవ్ డా. గద్దె జాన్ హామిల్టన్ కుమారులు.

ఫిబ్రవరి 2021లో మరణించిన రెవ్. హామిల్టన్ దగ్గర ఉన్న ఛాయాచిత్రాలు, ఇతర జ్ఞాపకాలు వారిరివురి దగ్గర  ఇప్పటికీ సీజీవంగా ఉన్నాయి. చర్చిలో జరిగిన సేవకు ఆహ్వానం కార్డు, క్వీన్ యొక్క వ్యక్తిగతంగా సంతకం చేసిన ఫోటో, ఆమె స్వయంగా రెవ్. హామిల్టన్‌కు బహుకరించారు. అంతేకాదు ఆమె సందర్శించిన రెండు సంవత్సరాల తర్వాత, నవంబర్ 25, 1985న బకింగ్‌హామ్ ప్యాలెస్ నుండి క్వీన్స్ లేడీ-ఇన్-వెయిటింగ్, రోజ్ బేరింగ్ సంతకం చేసిన రెండు లేఖలను పంపారు.

జోయెల్ హామిల్టన్, లేఖ యొక్క చిత్రాన్ని మీడియాతో పంచుకున్నారు, తనకు ఆరేళ్లు వయస్సు ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి ఇప్పటికీ జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. “బోలారమ్‌లోని సదర్ బజార్‌లోని మా ఇంటికి బ్రిటిష్ హైకమీషనర్‌తో కాన్వాయ్ రావడం నాకు గుర్తుంది, హై కమీషనర్ కూర్చుని, నాన్నతో సేవ గురించి చర్చించడం, దశలవారీగా చేసిన రిహార్సల్స్ కూడా ఉన్నాయి,” అని  ఆయన గుర్తు చేసుకున్నారు.

రాణి, చర్చిలో ప్రెస్‌బైటర్‌ను కలుసుకున్నప్పుడు, ఆమె సంతకం చేసిన ఆమె ఫోటోగ్రాఫర్‌ను కూడా అతనికి బహుకరించింది, సైనికపురిలోని వారి ఇంటిలో ఇప్పటికీ ఆ ఫొటో ఉంది.  “అవి గర్వించదగిన క్షణాలు. ఆ జ్ఞాపకాలను ఇంకా మాకు గుర్తున్నాయి.   వారి తల్లి లీలా గ్రేస్ హామిల్టన్, రెవ్ హామిల్టన్ చాలా సంవత్సరాల తరువాత కూడా రాణి సందర్శనకు సంబంధించిన అన్ని కథనాలను పంచుకున్నారు.

నిజాం రాజు అరుదైన కానుక..

క్వీన్‌ ఎలిజబెత్‌-2 వివాహం 1947లో జరిగింది. ఈ సందర్భంగా అప్పటి నిజాం ప్రభువు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ ఆమెకు అత్యంత విలువైన వజ్రాలహారాన్ని బహుమతిగా అందజేశారు. లండన్‌కు చెందిన నగల తయారీ సంస్థ కార్టియర్‌ ప్రతినిధులను రాణి వద్దకు పంపిన నిజాం ప్రభువు.. కానుకను ఎంచుకోవాలని కోరారు. దీంతో 300 వజ్రాలు పొదిగిన ఓ ప్లాటినం నెక్లె్‌సను ఆమెను ఎంపిక చేసుకున్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌-2 వివిధ సందర్భాల్లో ఆ హారాన్ని ధరించి కనిపించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles