24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణకు కేంద్రం రూ.1,05,812 కోట్లు బకాయిపడింది: హరీశ్ రావు

హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న నిధులు, గ్రాంట్లు, పరిహారం రూపంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.1,05,812 కోట్లు బకాయిపడింది. కేంద్రం వీటిని తిరిగి చెల్లిస్తే  రాష్ట్ర ప్రభుత్వం అప్పులు (3.29 లక్షల కోట్లు) మూడింత ఒక వంతు తీరతాయని మంత్రి హరీష్ రావు నిన్న శాసనసభలో పేర్కొన్నారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల ప్రభావం కారణంగా తెలంగాణకు జరిగిన నష్టాన్ని వివరించారు. కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తే అప్పులు తీర్చడం పక్కన పెడితే.. కొత్తగా రుణాలు కూడా పొందాల్సిన అవసరం కూడా ఉండదని ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు అన్నారు.

మంగళవారం అసెంబ్లీలో “ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానం- రాష్ట్ర ప్రగతిపై ప్రభావం” అనే అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రాబట్టడంలో విజయం సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సత్కరిస్తానని చెప్పారు.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్నదని, రాష్ట్రాలపై ఆంక్షలు విధిస్తోందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం రుణాలపై సమీక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన అత్యున్నత అధికార అంతర్ ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేయగా, కమిటీని ఏర్పాటు చేయకుండానే రాష్ట్రాల రుణాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేంద్రాన్ని దుయ్యబట్టారు.

తెలంగాణ రాష్ట్రానికి జీఎస్‌డీపీలో 4 శాతం వరకు రుణాలు పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం పట్టుబట్టడంతో రైతుల కోసం 0.5 శాతం రుణాలను వదులుకున్నామని హరీశ్‌రావు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం పనితీరు ఆధారంగా తెలంగాణకు వివిధ విభాగాల్లో రూ.6,268 కోట్లు విడుదల చేయాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసులను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి అన్నారు.

‘‘జీఎస్టీ అమలు ద్వారా రాష్ట్రాల పన్ను వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కానీ ఎక్కువ సెస్ విధించడం ద్వారా రాష్ట్రానికి పన్ను భాగాన్ని తగ్గించింది” అని ఆర్థిక మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన ఆదాయంలో 22.26 శాతం సెస్, సర్‌చార్జీల ద్వారా పొందుతుండగా, రాష్ట్రాలు తమ ఆదాయాన్ని కోల్పోతున్నాయి. కేంద్రం ఆర్జించే మొత్తం ఆదాయంలో కేవలం 29.6 శాతమే రాష్ట్రాలకు ఇస్తున్నారు.

గత ఎనిమిదేళ్లలో, రాష్ట్ర యాజమాన్యం-పన్ను-ఆదాయంలో 11.5 శాతం వృద్ధితో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 9.7 శాతంతో ఒడిశా రెండో స్థానంలో, 9.2 శాతం వృద్ధితో హర్యానా మూడో స్థానంలో నిలిచాయి. అదేవిధంగా, దేశ జనాభాలో కేవలం 2.9 శాతం ఉన్నప్పటికీ, గత ఎనిమిదేళ్లలో జిడిపిలో తెలంగాణ సహకారం 4 శాతం నుండి 4.9 శాతానికి పెరిగిందని మంత్రి హరీష్ రావు తన ప్రసంగంలో తెలిపారు.

కార్పొరేషన్ల పేరిట కేంద్రం పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొంటున్నప్పటికీ.. వాటిని రికవరీలో పెట్టడం లేదని, రాష్ర్టాలు ఆ తరహాలో తీసుకొనే రుణాలను మాత్రం రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌తో రికవరీ చేస్తమంటున్నదని తెలిపారు. కేం ద్ర ప్రభుత్వం 2017-18లో రూ.81 వేల కోట్లు, 2018-19 లో రూ.లక్షా 58 వేల కోట్ల ను రెవెన్యూ వ్యయం కోసం ఔటాఫ్‌ బడ్జెట్‌ అప్పులు తీసుకొనడాన్ని కాగ్‌ తప్పుపట్టిందని గుర్తుచేశారు. గత ఐదారేండ్లలో 6లక్షల కోట్లు కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం బయట అప్పు తీసుకున్నదని వెల్లడించారు. కేంద్రానికి ఒక నీతి, రాష్ర్టాలకు ఒక నీతి అన్న చందంగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

ఎనిమిదేండ్ల మోదీ పాలన సారాంశం అంతా విఫలం.. విషం.. విద్వేషమేనని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ సర్కారు ఎనిమిదేండ్ల పాలన సారాంశమంతా సఫలం.. సంక్షేమం, సామరస్యమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles