23.7 C
Hyderabad
Monday, September 30, 2024

తెలంగాణలో సెప్టెంబరు 26 నుంచి దసరా సెలవులు!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 8 మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 25, అక్టోబర్ 9 ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయని తెలిపింది. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10న అంటే సోమవారం ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు  అన్నీ జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా  అక్టోబర్ 5న దసరా పండుగ జరుపుకోనున్నారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో సెలవులను పెంచిన విషయం తెలిసిందే.

పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 22 నుండి 28 వరకు క్రిస్మస్ సెలవులు, నాన్ మిషనరీ పాఠశాలలకు జనవరి 13 నుండి 17, 2023 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి.

గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇచ్చిన నేప‌థ్యంలో..  9,10 తరగతి విద్యార్థుల‌కు సెలవులు తగ్గించాలని యోచిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తాజాగా ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో వారి కూడా మొత్తం 15 రోజుల సెలవులు వ‌చ్చాయి. ప్రభుత్వ ప్రకటనతో ఆ ప్రచారానికి తెర పడింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles