23.7 C
Hyderabad
Monday, September 30, 2024

సిద్దిపేట గొల్లభామ‌ చీరలకు యునెస్కో గుర్తింపు… మంత్రి హరీష్‌రావు!

హైదరాబాద్: తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే చారిత్రక కట్టడంగా నిలిచిన రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన యునెస్కో…ఇప్పుడు తెలంగాణలోని నేతన్నలకు అరుదైన గుర్తింపు ఇచ్చింది.  సిద్దిపేట నేతన్నల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే.. గొల్లభామ‌ చీరలకు యునెస్కో గుర్తింపు దక్కింది. దీనిపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో పొందడం గర్వకారణం అని.. ఇది నేతన్నల నైపుణ్యానికి అంతర్జాతీయ స్థాయిలో లభించిన గౌరవం అని వ్యాఖ్యానించారు. వనితల సింగారం దారాల్లో ఇమిడిపోతే.. మహిళామణుల ముగ్ధత్వం చీరలో మెరిసిపోతే.. అదే సిద్ధిపేట గొల్లభామ చీర అని మంత్రి హరీశ్ రావు వివరించారు.

మంత్రి హరీష్‌రావు ఆదివారం తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు … సిద్దిపేట జిల్లాలోని చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ప్రత్యేకమైన చీరలకు సిద్దిపేట ఏకైక చిరునామాగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు తాము తప్పకుండా గొల్లభామ చీరలను బహుమతిగా అందజేస్తామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి తెలిపారు.

సిద్దిపేట నేతన్నల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ చీరల తయారీలో సిద్దిపేటకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది.  10ఏళ్ల క్రితం భౌగోళిక గుర్తింపు పొందిన సిద్దిపేట గొల్లభామ చీర … ఇప్పుడు యునెస్కో గుర్తింపు పొందడంపై సిద్దిపేట నేతన్నలకు మంత్రి అభినందనలు.. శుభాకాంక్షలు తెలిపారు.

నేతన్నల అద్భుతమైన పనిని యునెస్కో గుర్తించడం సంతోషంగా ఉందని, గోల్కొండ హస్తకళల షోరూమ్‌లో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసి టెక్స్‌టైల్స్ శాఖ ద్వారా గొల్లభామ చీరలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles