23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

సివిల్స్ అభ్య‌ర్థుల‌కు బీసీ స్ట‌డీ స‌ర్కిల్ ఉచిత కోచింగ్!

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని బీసీ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. సివిల్స్ -2023 రాయాల‌నుకునే అభ్య‌ర్థుల‌కు బీసీ స్ట‌డీ స‌ర్కిల్‌  కోచింగ్ ఇవ్వ‌నుంది. యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-కమ్-మెయిన్ పరీక్ష, 2023 కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రోగ్రామ్‌ను అక్టోబర్ 17 నుండి ప్రారంభించనుంది.

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని టీఎస్ బీసీ స్టడీలో, హన్మకొండలోని టీఎస్ బీసీ స్టడీ సర్కిల్‌లో కోచింగ్ అందించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు కోచింగ్ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. బడుగు, బలహీన వర్గాలు ప్రభుత్వం అందిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యతోనే సామాజిక సమానత్వం ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు.

ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన మెగా జాబ్ మేళాలో తమ సత్తా చాటి ప్రభుత్వం కొలువు సాధించాలని పట్టుదలగా ఉన్న నిరుద్యోగులకు  నిరుద్యోగులకు బీసీ స్డడీ సర్కిల్ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.  గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ, గురుకుల టీచర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా ఆఫ్ లైన్ కోచింగ్ అందిస్తోంది. పోటీ పరీక్షలకు సంబంధించిన సుమారు 300 వీడియో తరగతులను యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచింది.

బిసి స్టడీ సర్కిల్స్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేద, బడుగు బలహీన వర్గాల వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే విధంగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రైవేటు సంస్థల్లో కోచింగ్ తీసుకోలేని వారికి నిపుణులతో ఉచితంగా పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తున్న ఘనత ఒక్క బీసీ స్డడీ సర్కిల్‌కే దక్కింది. తెలంగాణ బిసి స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన సుమారు రెండువేలమంది విద్యార్థులకు ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉద్యోగాలు రావడంతో బిసి స్టడీ సర్కిల్ కొలువులకు నెలవుగా మారింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles