23.7 C
Hyderabad
Monday, September 30, 2024

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌… మెట్రో రైలు వేళలు పొడిగింపు!

హైదరాబాద్ : నగరవాసులకు మెట్రో రైలు మంచి శుభవార్త అందించింది. ఈ నెల 10 వ తేదీ నుంచి మెట్రో సేవలను పొడిగిస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రైలు వేళలు రాత్రి పూట 11 గంటల వరకు పొడిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ సమయ వేళలు అక్టోబర్ 10 సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఉదయం పూట ఎప్పటిలాగే 6 గంటలకు మెట్రో రైలు ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

ప్రస్తుతం రాత్రి 10.15 గంట‌ల వ‌ర‌కే ట‌ర్మిన‌ల్ స్టేష‌న్ల నుంచి చివ‌రి మెట్రో రైలు ఉండగా, దీనిని దీన్ని 11 గంట‌ల వ‌ర‌కు పొడిగించారు. అయితే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ సమయ వేళలను పెంచినట్లు మెట్రో రైల్ ఎండీ తెలిపారు.  45 నిమిషాల సమయం పెంచడంతో నగరవాసులు మరిన్ని అదనపు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని వీటిని సద్వినియోగం చేసుకోకుని మెట్రో రైలుకు తోడ్పాటును అందించాలని ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇకపోతే.. అక్టోబర్ 4న హైదరాబాద్ మెట్రో‌ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. మెట్రోలో ప్రయాణించేవారు.. ఇకపై వాట్సాప్ ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. గత కొన్ని నెలలుగా అనేక ట్రయల్స్ తర్వాత.. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ బిల్‌ఈజీ, సింగపూర్‌కు చెందిన ShellinfoGlobalsgతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వాట్సాప్ ద్వారా పూర్తి డిజిటల్ చెల్లింపుతో ఇ-టికెట్ పొందవచ్చని.. దేశంలోనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన మొదటి మెట్రో రైల్‌గా తాము నిలిచామని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

మొత్తంగా హైదరాబాద్‌ నగర మెట్రో రైలు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు లక్షల మంది మెట్రో ద్వారా ప్రయాణిస్తున్నారు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలంటే చాలా మంది ప్రయాణికులు మెట్రో రైలులు ఆశ్రయిస్తున్నారు. అందుకు తగినట్లుగానే మెట్రో సంస్థ కూడా మరిన్ని సదుపాయాలను కల్పిస్తోంది. పండగలు, ఇతర ప్రత్యేకమైన సమయాల్లో మెట్రో రైళ్లను పెంచుతోంది మెట్రో సంస్థ. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా మరిన్ని మెట్రో రైళ్లను పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా చివరి మెట్రో రైలు సమయాన్ని పొడిగించడంతో ప్రయాణికులకు మరింతగా ఉపయోగం ఉండనుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles