23.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘తెలంగాణ కోసం ప్రాణాలిస్తాం’ కానీ మోదీకి, ఈడీకి భయపడం… మంత్రి కేటీఆర్!

హైదరాబాద్: తెలంగాణ కోసం మా ఫ్రాణాలైనా ఇస్తాం కానీ మోదీకి , ఈడీకి లొంగే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.  మంగళవారం తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్వీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ఏజెన్సీలు జరిపిన దాడులను రావు ప్రస్తావించారు. ‘అక్కడ మోడీకి, ఇక్కడ బోడి’కి భయపడేంతగా తెలంగాణలో ఎవరూ లేరని, తెలంగాణ కోసం చస్తాం కానీ, మోడీకి, ఈడీకి భయపడబోమని చలోక్తులు విసిరారు. మునుగోడు ఎన్నిక ఒక కాంట్రాక్టర్‌ అహానికి, ఆ నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్నదని తెలిపారు.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్‌ఎస్ ఏర్పాటును సమర్థిస్తూ, గుజరాతీ ఇక్కడ రాజకీయాలు చేయగలిగినప్పుడు కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్లలేరని అన్నారు. ‘‘పనికిరాని మోడల్‌గా ఉన్న గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ దేశానికి పనికొస్తే.. తెలంగాణ మోడల్‌ ఎందుకు పనిచేయదు.. బీఆర్‌ఎస్‌ ఏర్పడినా టీఆర్‌ఎస్‌ ఎజెండాలో మార్పు లేదు.. ప్రజల ఆశీస్సులు ఉంటే.. , BRS కూడా విస్తరించవచ్చు” అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదని ఆరోపించారు.

కేసీఆర్‌ క్షుద్ర పూజలు చేస్తున్నరంట! ఈ బిత్తిరోడు చెప్పితే ఫర్వాలేదు కానీ ఆమెకు (నిర్మలాసీతారామన్‌) ఏమైంది? ఆమె నిర్మలమైన మనిషి లాగ ఉండే.. ఆమె కూడా ఆగమైందని కేటీఆర్ అన్నారు. ‘‘ఒకప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి ప్రత్యర్థులు ఉండేవారు.. వారిపై మాట్లాడాలన్నా, ఎలాంటి విమర్శలు ఎదుర్కొనాలన్నా కాస్త మర్యాద ఉండేది.. నేటి ప్రత్యర్థులు బఫూన్‌లు.. తెలంగాణ ఉద్యమ సమయంలో బండి సంజయ్ ఎక్కడ ఉన్నారు? పొగాకు, లవంగాలు నమలుతూ తిరుగుతున్నాడు” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

జిల్లా అభివృద్ధికి, మునుగోడు అభివృద్ధి కోసం రూ.18 వేల కోట్లు కేంద్రం నిధులు ఇస్తే టీఆర్‌ఎస్‌ ఉప ఎన్నిక బరినుంచి తప్పుకొంటుందన్న మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన మాటకు పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌గా కట్టుబడి ఉంటానని సవాల్‌ విసిరారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రీ ఫైనల్‌ కూడా కాదని, అంతకుముందు జరిగే యూనిట్‌ టెస్ట్‌ లాంటిదని పోల్చారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సీటు వల్ల పార్టీకి ఎలాంటి తేడా ఉండదు. ‘రాజగోపాల్‌రెడ్డిని ఒక్కటే అడుగుతున్న.. నీకు చిత్తశుద్ధి ఉంటే.. నీకు కాంట్రాక్టు దక్కిన వైనంపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలి. క్విడ్ ప్రోకో లేదని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, భాగ్యలక్ష్మి దేవాలయం ఎదుట ప్రమాణం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles