24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు ఉండవు… టీఎస్‌పీఎస్‌సీ!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కటాఫ్ మార్కుల విషయంలో అభ్యర్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) నిన్న కీలక ప్రకటన చేసింది.  గ్రూప్-1 మెయిన్స్‌కు క్వాలిఫై కావడానికి ప్రిలిమినరీ పరీక్షలో  ఎలాంటి  ‘కట్ ఆఫ్’ మార్కులు లేవని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  సోమవారం తెలిపింది. ప్రిలిమినరీ పరీక్ష కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమేనని  తెలిపింది. దీంతో గ్రూప్‌-1 ప్రిలిమనర్‌ పరీక్ష కటాప్‌ మార్కులపై సోషల్‌ మీడియాల్లో జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడింది.

ఈ పరీక్ష ఆధారంగా 1:50 మధ్య అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఖాళీలను బట్టి ఒక్కో పోస్టుకు 1:50 చొప్పిన మెయిన్స్ కు క్వాలిఫై చేస్తామని అధికారులు ప్రకటించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 పోస్టులకు గాను 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,86,051 మంది హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడ్డారు.

గ్రూప్-1మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహించే ఆలోచనలో టీఎస్పీఎస్సీ ఉంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles