23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజులు భారీగా పెరిగాయి!

  • ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు
  • 40 కాలేజీల్లో రూ.లక్ష దాటిన ఫీజులు
  • కనీస ఫీజును రూ.45 వేలకు పెంపు
  • అత్యధికంగా ఎంజిఐటీలో రూ.1.60 లక్షలుగా ఫీజు
  • మూడేళ్ల వరకు అమలు కానున్న కొత్త ఫీజులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజులు భారీగా పెరిగాయి. . తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టిఎఎఫ్‌ఆర్‌సి) సిఫారసుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఆదాయ, వ్యయాలపై కాలేజీలు అందించిన వివరాల ఆధారంగా ఫీజులను 10 నుంచి 30శాతం వరకు ప్రభుత్వం పెంచింది. కొత్త ఫీజులు ఈ ఏడాది నుంచి వచ్చే మూడేళ్లపాటు… అంటే 2024-25 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉంటాయి. మినిమమ్ ఫీజు రూ.45 వేలుగా ఖరారు చేశారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు రూ.లక్ష దాటింది. అత్యధికంగా ఎంజిఐటీలో రూ. 1.60 లక్షలు కాగా, సీవీఆర్‌లో రూ. 1.50 లక్షలు, సిబిఐటి, వర్ధమాన్, వాసవి ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ. 1.40 లక్షల చొప్పున పెంచారు. ఇంజనీరింగ్ ఫీజులు మూడేళ్ల క్రితం ఫీజులతో పోల్చితే 10 నుంచి 20 వరకు పెరిగాయి. చాలా కాలేజీల్లో ఫీజులు స్వల్పంగా పెరగగా, కొన్ని కాలేజీల్లో మాత్రం 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో రూ.1.30 లక్షలు ఫీజు ఉండగా, దానిని రూ.1.40 లక్షలకు పెంచారు. అలాగే సిబిఐటిలో గతంలో రూ.1.34 లక్షలు ఫీజు ఉండగా, దానిని రూ.1.40 లక్షలకు పెంచారు. అయితే ఎంజిఐటీలో గతంలో రూ.1.08 లక్షలుగా ఉన్న ఫీజు అత్యధికంగా రూ.1.60 లక్షలకు పెరిగింది. విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో రూ.1.31 లక్షలుగా ఫీజు ఉండగా, దానిని రూ.1.35 లక్షలకు ప్రభుత్వం పెంచింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం
ఇంతకుముందు, అర్హతగల తెలంగాణ విద్యార్థులు ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద కనీస రుసుము రూ. 35000 పొందేవారు. ఇప్పుడు కనీస రుసుము రూ. 45000కు పెరిగింది. మరి ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ మొత్తం కూడా పెరుగుతుందో లేదో ఇంకా ప్రభుత్వం స్పష్టం చేయలేదు.

తెలంగాణలోని వివిధ ప్రైవేట్ కాలేజీల్లో ఇంజినీరింగ్ కోర్సుల ఫీజు పెంపు నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సులు భారం కానున్నాయి. మరోవైపు ఎంసెట్‌లో 10000లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థుల మొత్తం కాలేజీ ఫీజులను ప్రభుత్వమే తిరిగి చెల్లించాల్సి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles