24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కార్మికులను ‘యజమానులు’గా మార్చిన ‘దళిత బంధు’ స్కీమ్‌!

కరీంనగర్: శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే దళిత బంధు. దళితుల సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం వారి జీవితాల్లో కొత్త కాంతులు తీసుకువస్తోంది. కార్మికులను ‘యజమానులు’గా మార్చిన వైనం ‘దళిత బంధు’ స్కీమ్‌ ద్వారా సుసాధ్యమైంది. వివరాల్లోకి వెళ్తే…  కరీంనగర్ జిల్లాకు చెందిన శెనిగెరపు కళ్యాణ్, శెనిగెరపు రాజ్‌కుమార్‌లు హైదరాబాద్‌లోని వివిధ లగేజీ దుకాణాల్లో సాధారణ ఉద్యోగులుగా కొన్నాళ్లుగా పనిచేసేవారు.  ఇప్పుడు, వీరిద్దరూ, శెనిగేరపు చంద్రయ్యతో కలిసి, కరీంనగర్ పట్టణంలో ఒక బ్రాండెడ్ కంపెనీ ఫ్రాంచైజీకి యజమానులుగా ఉన్నారు.  త్వరలో మంచిర్యాలలో మరో షోరూమ్‌ను తెరవడానికి ప్లాన్ చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  దళిత బంధు పథకం జిల్లాలో దళితుల జీవితాలను ఏ విధంగా మార్చిందో వారి కథే ఒక ఉదాహరణ. అన్ని ఖర్చులు పోను ప్రతినెలా సగటున రూ.లక్ష ఆదాయం పొందుతున్న ఈ ముగ్గురూ హుజూరాబాద్ మండలం చెల్పూర్ వాసులు. వారు తమ భార్యల పేరిట గ్రూప్ బిజినెస్ కేటగిరీ కింద దళిత బంధు పథకానికి దరఖాస్తు చేసుకుని, పథకానికి అర్హత పొందారు.

ప్యాసింజర్, గూడ్స్ రవాణా వాహనాలు, ఎర్త్‌మూవర్‌లు, టిప్పర్లు, డెయిరీ లేదా ఇతర యూనిట్లను ఎంచుకోవడానికి బదులుగా, వారు భిన్నంగా ఆలోచించి, లగేజీ వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. వీరిలో ఇద్దరు గతంలో హైదరాబాద్‌లోని ప్రముఖ లగేజీ తయారీదారుల ఔట్‌లెట్లలో పనిచేసినందున, వారు కరీంనగర్ పట్టణంలో కంపెనీ ప్రత్యేక స్టోర్‌గా ఫ్రాంచైజీని తెరిచారు. గత జూన్‌లో రాజ రాజేశ్వర ఎంటర్‌ప్రైజెస్ పేరుతో జిల్లా కోర్టు చౌక్‌కు సమీపంలో ప్రారంభించారు.  రూ. 21 లక్షలు వెచ్చించి కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా స్టోర్ ఆరంభించారు. సామాను రవాణా కోసం నాలుగు చక్రాల ట్రాలీని కూడా కొనుగోలు చేశారు.

ఇంతకుముందు కళ్యాణ్ 18 సంవత్సరాలు స్టోర్ మేనేజర్‌గా పని చేయగా, రాజ్‌కుమార్ 10 సంవత్సరాలు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. వీరికి నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వచ్చేది. ప్రస్తుతం నిర్వహిస్తున్న స్టోర్ విక్రయాల రికార్డుల ప్రకారం జూన్‌లో రూ.1.8 లక్షలు, జూలైలో రూ.8.5 లక్షలు, ఆగస్టులో రూ.7.2 లక్షలు, సెప్టెంబర్‌లో రూ.5.15 లక్షలు, ఈ నెలలో ఇప్పటివరకు రూ.2.4 లక్షల వ్యాపారం జరిగింది.

రాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తాను సొంతంగా వ్యాపారం చేసుకోగలనని ఎప్పుడూ అనుకోలేదని, దళిత బంధు పథకాన్ని ప్రారంభించి, తమ కల సాకారం చేసినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

తొలుత ప్యాసింజర్ వాహనాలకు కూడా దరఖాస్తు చేసుకోవాలని భావించినా అప్పట్లో వాహనాల గ్రౌండింగ్ ఆలస్యం కావడంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తమకు గతంలో లగేజీ వ్యాపారంలో అనుభవం ఉండడంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో ఆలోచనను పంచుకోగా వారు కూడా సానుకూలంగా స్పందించి ఫైలును కదిలించారు.

తమ వ్యాపార నమూనాకు ఆకర్షితులై మంచిర్యాలలో మరో స్టోర్‌ను ప్రారంభించేందుకు కంపెనీ రాష్ట్ర ఇన్‌చార్జి అనుమతి ఇచ్చారని, మంచిర్యాలలో సొంతంగా స్టోర్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నామని తెలిపారు.

దళిత బంధు స్కీమ్ ప్రయోజనాలు…

  • అర్హులైన ఎస్‌సీలకు దళిత బంధు కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది
  • ఇది పూర్తి ఉచితం
  • రూ.10 లక్షల ఆర్థిక సాయం
  • ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సినవసరం లేదు
  • ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్దిదారుని అకౌంట్లోకే మనీ క్రెడిట్ అవుతుంది
  • వైన్ షాపులు, మెడికల్ షాపులు, రసాయనాల దుకాణాలు, రైసు మిల్లులు వంటి వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు లైసెన్సులు పొందేందుకు రిజర్వేషన్ వర్తింపు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles