24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

చలికాలం వచ్చేసింది… తెలంగాణలో తగ్గుముఖం పట్టిన ఉష్టోగ్రతలు!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల తర్వాత ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. జూన్‌లో ప్రారంభమైన నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి  తిరోగమనం కానున్నాయి.  దీంతో నవంబర్ ప్రారంభంలో ఉష్టోగ్రతలు తగ్గుముఖం పడతాయని  భారత వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) తన వాతావరణ సూచనలో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో 15 నుండి 19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో 16 నుంచి 19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

గత ఇరవై నాలుగు గంటల్లో సంగారెడ్డి (13.1), రంగారెడ్డి (13.3), వికారాబాద్ (13.6), సిద్దిపేట (14.1), మెదక్ (14.3) జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా పడిపోయాయి.

గత ఇరవై నాలుగు గంటల్లో సంగారెడ్డి జిల్లాలోని న్యాకల్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత (13.1°C) నమోదైంది మరియు GHMC పరిధిలో రాజేంద్రనగర్‌లో 15°C ఉష్ణోగ్రత నమోదైంది.

ప్రధానంగా రాష్ట్రంలోని ఉత్తర మరియు ఈశాన్య జిల్లాల్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయి. దక్షిణ, ఆగ్నేయ జిల్లాలు కాస్త సీజన్‌లో వెచ్చగా ఉంటాయని.. అని వాతావరణ శాఖ ఒక నివేదికలో పేర్కొంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles