33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌, అదనపు సీఈవోల మధ్య వివాదం… ఆగిపోయిన బోర్డు కార్యకలాపాలు!

హైదరాబాద్‌: తెలంగాణ వక్ఫ్‌ బోర్డులో అదనపు సీఈవో,  ఛైర్మన్ మధ్య అధికారాల విషయంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. రోజువారీ ఆఫీసు వ్యవహారాల విషయంలో ఇద్దరికీ అసలు పొపగటంలేదు. దీంతో వక్ఫ్ బోర్డు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్టోబరు 20న వక్ఫ్‌ బోర్డు సమావేశంలో అదనపు సీఈవో  షానవాజ్‌ ఖాసీం (ఐపీఎస్‌)ను మాతృసంస్థకు తిరిగి పంపించాలంటూ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే.

సాధారణ ఆఫీసులో వ్యవహారాలను పెండింగ్‌లో పెట్టేటప్పుడు ఒకరికొకరు ఎదురుతిరిగారు.  షానవాజ్ ఖాసీమ్‌ను మాతృసంస్థకు సరెండర్ చేసినందున, బోర్డులో  ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవని ఛైర్మన్ తెలిపారు. అయితే ఈ  తీర్మానాన్ని ఆమోదించేంచేందుకు  అధికారులు మాత్రం ఇష్టపడలేదు. ఇకనుంచి   వక్ఫ్‌బోర్డు అధికారులు ఫైళ్లను ఆయన వద్దకు  తీసుకోవద్దని కోరినట్లు తెలిసింది.   ” అదనపు సీఈవో నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నంత కాలం, నేను బోర్డు ఛైర్మన్‌గా అన్ని వ్యవహారాలకు బాధ్యత వహిస్తాను, అన్ని ఫైళ్ళను నా ముందు మాత్రమే ఉంచాలి” అని చైర్మన్ చెబుతున్నారు”.

మరోవైపు వక్ఫ్ బోర్డ్ తీర్మానాన్ని తెలంగాణ వక్ఫ్‌ బోర్డు అదనపు సీఈవో అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దీన్ని అసంబద్ధమైన, చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని తానుగానీ, ప్రభుత్వంగానీ అంగీకరించడం లేదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఆయనే ఏడీఎల్ సీఈవో పదవిలో కొనసాగుతారని బోర్డు అధికారి  ఒకరు అభిప్రాయపడ్డారు. తనకు వ్యతిరేకంగా చేసిన తీర్మానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వక్ఫ్ బోర్డు అదనపు సీఈవో షానవాజ్ ఖాసీం అధికారులను పిలిచి సీఈవో గదిలో ఉన్న లాకర్ల తాళాలు తీసుకుని మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయంలో తన కస్టడీలో ఉంచాలని కోరినట్లు సమాచారం.  ఇంతలో వక్ఫ్ బోర్డు మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయిందన్న వార్తల నేపథ్యంలో పోలీసు సిబ్బందిని వక్ఫ్ బోర్డు వద్ద మోహరించారు. ఉద్యోగుల్లో కొంతమంది సీఈఓపై విధేయత చూపగా మరికొంతమంది  ఛైర్మన్‌ వైపు చేరారు. దీంతో వక్ఫ్ బోర్డు ఉద్యోగుల మధ్య వాగ్వాదం పెరుగుతోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles