23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాజాసింగ్‌కు షాక్… పీడీ యాక్ట్ సబబే అన్న అడ్వైజరీ కమిటీ!

హైదరాబాద్: గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ను అడ్వైజరీ బోర్టు సమర్థించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది. తనపై నమోదు చేసిన పీడీయాక్ట్‌ను ఎత్తివేయాలని రాజాసింగ్ చేసిన విజ్ఞప్తిని కమిటీ తిరస్కరించింది. పీడీ యాక్ట్ (PD Act) అడ్వైజరీ బోర్డు చైర్మన్ భాస్కర్ రావు, మరో ఇద్దరు జడ్జీల సమక్షంలో విచారణ చేపట్టారు. రాజాసింగ్‌పై 101కేసులు ఉన్నాయని వాటిలో 18 కమ్యూనల్ కేసులు ఉన్నాయని పోలీసులు అడ్వైజరీ కమిటీ దృష్టికి తెచ్చారు. అందుకే పీడీ యాక్ట్ నమోదుచేసినట్లు చెప్పారు. అయితే తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేసినట్టుగా రాజాసింగ్ బోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కమిటీ సభ్యులు పోలీసుల వాదనతో ఏకీభవించారు. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించారు.

సెప్టెంబరు 9న, రాజాసింగ్‌పై పెట్టిన పీడీ యాక్ట్ (PD Act) ను ఎత్తివేయాలని అతని భార్య ఉషాబాయి బోర్డుకు వినతిపత్రం సమర్పించింది. అంతకుముందు రాజా సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోర్డు ముందు విచారణకు హాజరయ్యారు.

“రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ను అడ్వైజరీ బోర్టు సమర్థిస్తూ ఇచ్చిన  ఉత్తర్వు అంతిమమైనది కాదు, దానిని హైకోర్టులో సవాలు చేస్తాం” అని ఉషా బాయి చెప్పారు. కాగా  పీడీ యాక్ట్ నమోదును వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా బాయి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. పీడీ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.

‘స్టాండ్-అప్ కామెడీ’ వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై శాసనసభ్యుడు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల తర్వాత హైదరాబాద్ పోలీసులు ఎమ్మెల్యేపౌ కఠినమైన పీడీ యాక్ట్‌ను ప్రయోగించి, చర్లపల్లి జైలులో ఉంచారు. తన నిర్బంధాన్ని చట్టవిరుద్ధంగా పేర్కొంటూ, పిడి యాక్ట్‌ను ప్రయోగించిన హైదరాబాద్ పోలీసుల చర్యలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన భారత్య టి.ఉషా బాయి కోర్టును అభ్యర్థించారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles