23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘ఉచిత వృత్తి విద్యా కోర్సు’లకు దరఖాస్తు చేసుకోండి!

హైదరాబాద్: బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (BIRED) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ యువకుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థ స్వయం ఉపాధి కోసం సాంకేతిక కోర్సులలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను అందిస్తుంది. 37 రోజుల ఉచిత వృత్తి శిక్షణా కార్యక్రమాన్ని బైర్డ్ (BIRED)  నిర్వహిస్తోంది. ఈ కోర్సులను నవంబర్ 21 నుంచి డిసెంబర్ 27 వరకు అందించనున్నారు. రాజేంద్ర నగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో అందించే ఈ శిక్షణకు 19-30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు.

శిక్షణా కోర్సులలో మొబైల్ సర్వీసింగ్ (SSC అంతకంటే ఎక్కువ), రిఫ్రిజిరేటర్ & AC రిపేర్ (ఇంటర్,అంతకంటే ఎక్కువ) ఎలక్ట్రీషియన్, పంప్-సెట్-రిపేరింగ్ (SSC ఫెయిల్ , అంతకంటే ఎక్కువ) ఉన్నాయి. శిక్షణ సమయంలో బోర్డింగ్, ప్రయోగశాలతో సహా అన్ని సౌకర్యాలు ఉచితంగా అందిస్తారు.

దరఖాస్తులను అక్టోబర్ 26 నుండి నవంబర్ 18 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం  www.bired.org వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles