30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మునుగోడులో టీఆర్ఎస్‌దే విజయం… ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడి!

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ శాతం భారీగా నమోదైంది. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగియ‌డంతో ఆయా సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్ల‌డించాయి. ఈ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం BRS)కి భారీ మెజారిటీ వస్తుందని  అంచనా వేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం టీఆర్‌ఎస్‌ 40 శాతానికి పైగా ఓట్లు సాధిస్తుందని, ఆ పార్టీ గెలుపు ఖాయమని తేలింది. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ఎస్‌ఏఎస్‌ (SAS) గ్రూప్ సర్వే ప్రకారం టీఆర్ఎస్‌కు 41-42 శాతం ఓట్లు, బీజేపీకి 35-36 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 16.5-17.5 శాతం ఓట్లు రావొచ్చని వెల్లడైంది. టీఆర్ఎస్ 12,000-12,500 ఓట్ల మెజారిటీని సాధిస్తుందని అంచనా వేసింది.

అదేవిధంగా ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 12-15 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమని జనంసాక్షి అంచనా వేసింది. మరో ఏజెన్సీ  HMR అంచనాల ప్రకారం గులాబీ పార్టీకి 42.13 శాతం ఓట్లు లభిస్తాయని, బీజేపీ (31.98 శాతం), కాంగ్రెస్ (21.06 శాతం) ఓట్లు సాధిస్తాయని పేర్కొంది.

థర్డ్ విజన్ రీసెర్చ్- ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా ప్రకారం టీఆర్ఎస్‌కు 48-51 శాతం ఓట్లు, బీజేపీకి 31-35 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 13-15 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ ప్రకారం టీఆర్ఎస్‌కు 42-43 శాతం ఓట్లు, బీజేపీకి 38.5 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 14-16 శాతం ఓట్లు, బీఎస్పీకి 3 శాతం, ఇతరులకు 1 శాతం వచ్చే ఛాన్స్ ఉంది.

త్రిశూల్ కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా అంచనాలను విడుదల చేసింది, పోలైన ఓట్లలో పార్టీకి 47 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీ, కాంగ్రెస్‌లు 31 శాతం, 18 శాతంతో రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles