24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

నిరుద్యోగ మైనారిటీ యువకులకు శుభవార్త…. నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ!

హైదరాబాద్: నిరుద్యోగ మైనారిటీ యువకులకు తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TSMFC) గుడ్ న్యూస్ చెప్పింది. కార్పొరేషన్ యొక్క శిక్షణ, ఉపాధి & ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ పథకం కింద ఆసక్తిగల విద్యావంతులైన నిరుద్యోగ మైనారిటీ యువకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పథకంలో భాగంగా ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు స్వల్పకాలిక క్రాష్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నేర్చుకోవచ్చు.

వెబ్ డెవలపర్ (FTCP, హార్డ్‌వేర్ & నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్), ప్రీ-ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్, అడ్వాన్స్‌డ్ బ్యూటీషియన్ మేకప్, మెహెందీ డిజైనింగ్, స్కల్ప్ కార్వింగ్, డిజిటల్ మార్కెటింగ్ & కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ & నెట్‌వర్కింగ్, స్ప్లికర్ & టైమ్ టెక్నీషియన్, స్ప్లికర్ & టెక్నీషియన్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ & రోబోటిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఫిజియో థెరపీ, డయాలసిస్ టెక్నీషియన్ మరియు ఇతర డిమాండ్ ఉన్న ఇన్నోవేటివ్ కోర్సుల శిక్షణ నవంబర్ 15 నుంచి జిల్లాల్లో ప్రారంభం కానున్నాయి.

అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లతో పాటు సమర్పించాల్సిన ధృవ పత్రాల వివరాలు…  ఆధార్ కార్డ్, అభ్యర్థి తప్పనిసరిగా తమ మైనారిటీ క్యాస్ట్ సమర్పించాలి.  క్రైస్తవులు అయి ఉండరాదు. అభ్యర్థి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం  లక్షన్నర రూపాయల కంటే తక్కువ  ఉండాలి. పట్టణ ప్రాంతాల అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం  2000001 కంటే తక్కువ ఉండాలి.మీ సేవా కార్యాలయం/తహశీల్దార్‌ఎంఆర్‌ఓ నుండి జారీ చేయబడిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఉద్యోగ ఉపాధి,  స్వయం ఉపాధి కోర్సుల కోసం అభ్యర్థి క్రాష్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో జాయిన్ అయేందుకు కనీస విద్యార్హతలు ఉండాలి.

తెలంగాణ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ యొక్క శిక్షణ, ఉపాధి & ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ పథకం కింద శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్న నిబద్ధత గల అభ్యర్థులు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారుల కార్యాలయం నుండి దరఖాస్తు ఫారమ్‌లను పొందవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను ఎన్‌క్లోజర్‌లతో పాటు తప్పనిసరిగా నవంబర్ 14 వరకు సమర్పించాలి. నవంబర్ 15 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles