23.7 C
Hyderabad
Monday, September 30, 2024

ఒకే రోజు ప్రారంభం కానున్న 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు!

హైదరాబాద్: తెలంగాణలో తొలిసారిగా రూ.4,080 కోట్లతో ఏర్పాటు చేసిన ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఒకేరోజు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాత్కాలికంగా 1,200 ఎంబీబీఎస్ సీట్లతోఈ వైద్య కళాశాలలను నవంబర్ 15 న ప్రారంభించాలని నిర్ణయించింది.

కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలను ఏర్పాటు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు సోమవారం తెలిపారు. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, రామగుండంలో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరానికి 1,200 మెడికల్‌ సీట్లను ఒకేసారి అందించడం తెలంగాణలో ఇదే తొలిసారి.

ఒక్కో మెడికల్ కాలేజీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.510 కోట్లు చొప్పున మొత్తం రూ.4,080 కోట్లు వెచ్చించింది. పక్కనే ఉన్న జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసి కాలేజీలకు అటాచ్ చేశారు.

1,200 MBBS సీట్లతో పాటు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో 85 శాతం B- కేటగిరీ మెడికల్ సీట్లను తెలంగాణ విద్యార్థులకు రిజర్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఈ విద్యా సంవత్సరం నుండి ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుండి అదనంగా 1,068 సీట్లు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.

2014లో తెలంగాణలో మొత్తం 850 మెడికల్ సీట్లు ఉండగా, 2022 నాటికి వాటి సంఖ్య 2,901కి పెరిగింది. తెలంగాణలో 192 అదనపు పీజీ ప్రభుత్వ మెడికల్ సీట్లను కూడా ఆరోగ్య శాఖ దక్కించుకుంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014లో 613 పీజీ సీట్లు ఉండగా… తాజాగా  పీజీ ప్రభుత్వ మెడికల్ సీట్ల సంఖ్య 1,249కి పెరిగాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles