33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

విద్యార్థులకు టీస్‌ఆర్‌టీసీ శుభవార్త… పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ పాస్ చెల్లుతుంది!

హైదరాబాద్: టీస్‌ఆర్‌టీసీ విద్యార్థులకు శుభవార్త వినిపించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) జారీ చేసిన బస్ పాస్ ఇక నుండి ఇకపై పల్లె వెలుగు బస్సుల్లోకి అనుమతి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) సర్క్యులర్ జారీ చేసింది. ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా నడపబడుతున్న పల్లె వెలుగు బస్సులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఈ విషయాన్ని టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. “గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ విద్యార్థులకు శుభవార్త. ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో (sic) ప్రయాణించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ బస్‌ పాస్‌కు అనుమతి ఉంది’’ అని టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

శివారు ప్రాంతాల నుంచి ఎంతోమంది స్టూడెంట్స్‌ సిటీలోని కాలేజీలు, స్కూళ్లకు వచ్చి చదువకుంటున్నారు. వీరు ప్రతిరోజూ డైలీ సర్వీస్ చేస్తుంటారు. అయితే ప్రజంట్ వారికి TSRTC జారీ చేసిన పాసులు కేవలం సిటీ బస్సుల్లోనూ చెల్లుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆ పాసులు చెల్లుబాటు అవ్వడం లేదు. నగర శివారు ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో సిటీ బస్సులు వెళ్లడం లేదు. దీంతో ప్రేవేట్ వాహనాలు ఆశ్రయిస్తుండంటంతో విద్యార్థులపై భారం పడుతుంది. ఈ క్రమంలో స్టూడెంట్స్‌తో పాటు వారి పేరెంట్స్‌ నుంచి సంస్థకు పెద్ద ఎత్తున రిక్వెస్టులు వచ్చాయి. ఆపై రివ్యూ చేసిన అనంతరం సిటీ బస్‌పాస్‌ ఉన్న స్టూడెంట్స్..  పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులోనూ ట్రావెట్ చేసేందుకు అనుమతిస్తూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మొయినాబాద్, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు శివార్లలోకి వెళ్లే పల్లె వెలుగు లేదా రూరల్ సర్వీస్ బస్సులను వినియోగించే విద్యార్థులకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుంది. సాధారణ విద్యార్థి బస్సు పాస్‌ను ఉపయోగించే విద్యార్థులకు ఇది వర్తించదు.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles